September Horoscope 2023: హిందూమతం ప్రకారం దాదాపు ప్రతి ఒక్కరూ జ్యోతిష్యంపై చాలా ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమంది రోజూ తమ జాతకం తెలుసుకుంటుంటే..కొంతమంది నెలకోసారి జాతకం ఎలా ఉందోనని పరిశీలిస్తుంటారు. కారణం జ్యోతిష్య శాస్త్రానికి హిందూమతంలో ఉన్న ప్రాధాన్యత. అదే క్రమంలో సెప్టెంబర్ నెల ఆ మూడు రాశులకు ఎలా ఉండనుందో పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఒకేలా ఉండదు. ఒక్కో రాశిపై అనుకూలంగా, ఒక్కో రాశిపై ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యంగా సెప్టెంబర్ నెల 3 రాశుల జాతకాలపై అత్యంత క్లిష్టంగా ఉండనుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ మూడు రాశులకు చెందిన వ్యాపారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. లేకపోతే ధనహాని తీవ్రంగా కలగవచ్చు. మకర రాశి జాతకులకు ఈ నెలలో ఆదాయంలో ఆటంకాలు రావచ్చు. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఇక కుంభ రాశి జాతకులకు సైతం ఖర్చులు పెరగడమే కాకుండా ధనహాని కలగవచ్చు. మీన రాశి జాతకులకు ఆర్ధికంగా తీవ్రమైన నష్టం వాటిల్లవచ్చు. అంటే ఈ మూడు రాశుల జాతకులు సెప్టెంబర్ నెలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. 


కుంభ రాశి జాతకులకు ఈ నెలలో ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఫలితంగా ఆర్దికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులకు లాభాలు ఏ మాత్రం ఉండవు. ఆదాయం, ఖర్చు సమానంగా ఉంటుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మరింతగా కష్టపడాల్సి వస్తుంది. హోటల్, రెస్టారెంట్ల వ్యాపారులకు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధికంగా లాభాలు పొందే క్రమంలో ఎక్కడా ఎటువంటి భారీ పెట్టుబడులు పెట్టవద్దు. ఇది మంచిది కాదు. గొడవలు, వివాదాలు తలెత్తే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండండి. 


సెప్టెంబర్ నెలలో మీన రాశి జాతకులకు సైతం ఇంచుమించు ఇదే పరిస్థితి ఉండవచ్చు. విదేశాలతో వ్యాపారం చేసేవారికి మంచి లాభాలుంటాయి. కానీ ఖర్చులు మితంగా ఉండాలి. ఆస్థుల కొనుగోలుకు దూరంగా ఉండాలంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్‌లో పోటీ పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఫలితంగా లాభాలు తగ్గిపోతాయి. ధనహాని కచ్చితంగా ఉంటుంది. దీనిని నియంత్రించాలంటే ఇతర మార్గాల్లో ఆదాయం కోసం ప్రయత్నించాలి. షేర్ మార్కెట్‌లో మంచి లాభాలు వస్తాయి. 


ఇక మకర రాశి జాతకులు ఈ నెలలో ఆర్ధికపరమైన నిర్ణయం తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంది. లేకపోతే ధనహాని తప్పదు. వ్యాపారంలో లాభాలు తక్కువగా ఉంటాయి. కారణం పోటీ ఎక్కువగా ఉండటమే. ఆన్‌లైన్, డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో అప్రమత్తత అవసరం. ట్రాన్స్‌పోర్ట్ రంగంలో ఉండేవారు ప్రభుత్వ పనుల్ని సకాలంలో పూర్తి చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆదాయంలో ఓ భాగం భవిష్యత్ కోసం దాచి పెట్టుకోవడం ఇప్పట్నించే ప్రారంభించాలి. 


Also read: Astrology: సెప్టెంబరు 10న రవి పుష్య యోగం.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook