హిందూమతంలోని జ్యోతిష్యం ప్రకారం ప్రత గ్రహం నిర్ణీత సమంలో రాశి మారుతుంటుంది. దాంతోపాటు ఏదైనా గ్రహం సూర్యుడికి సమీపంలో వస్తే ఆ గ్రహం ప్రభావం కోల్పోతుంది. జనవరి 17న గోచారంతో కుంభరాశిలో ప్రవేశించిన శనిగ్రహం ఇప్పుడు జనవరి 30వ తేదీన ఆస్థిత్వం కోల్పోనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిగ్రహం అస్థిత్వం కోల్పోవడం పరివర్తనం 12 గ్రహాల జాతకాలపై కచ్చితంగా పడుతుంది. 3 రాశులపై శని అస్థిత్వం కోల్పోవడం లాభదాయకం కానుంది. శని గ్రహం ఫిబ్రవరి 5, 2023 తిరిగి కోలుకోనుంది. శని అస్థిత్వం కోల్పోవడం ఏయే రాశులకు శుభసూచకమో పరిశీలిద్దాం.


మిథునరాశి


శనిగ్రహం అస్థిత్వం కోల్పోవడం మిధునరాశి జాతకులకు మంచిది. శని గోచారం, అస్థిత్వం కోల్పోయే పరిణామాల వల్ల మిధునరాశివారికి ఉద్యోగ, వ్యాపారాల్లో మెరుగైన లాభాలుంటాయి. కెరీర్‌లో విజయం లభిస్తుంది. కష్టపడినదానికి ప్రతిఫలం లభిస్తుంది. మత విషయాలపై శ్రద్ధ ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.


కన్యారాశి


కన్యారాశి జాతకులకు శనిగ్రహం అస్థిత్వం కోల్పోవడం శుభసూచకం. ఈ జాతకులకు నిలిచిపోయిన డబ్బులు తిరిగి చేతికి అందుతాయి. చిక్కుకున్న డబ్బులు సులభంగా లభిస్తాయి. అప్పుల్నించి విముక్తి లభిస్తుంది. శుభసూచకాలు కలుగుతాయి. పాత సమస్యల్నించి ఉపశమనం కలుగుతుంది. 


మకరరాశి


మకరరాశి జాతకులకు శనిగ్రహం అస్థిత్వం కోల్పోవడం వల్ల చాలా లాభాలుంటాయి. ఈ జాతకులకు తమ వాణి ఆధారంగా లాభాలు కలుగుతాయి. కేవలం వాయిస్‌‌తోనే పనులు చేయించుకుంటారు. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారంలో అద్భుత లాభాలుంటాయి.


మీనరాశి


శనిగ్రహం అస్థిత్వం కోల్పోవడం మీనరాశి జాతకులకు చాలా లాభాలుంటాయి. పనుల్లో విజయం ప్రాప్తిస్తుంది. ఇప్పటి వరకూ నిలిచిన పనులుంటే అవి పూర్తయిపోతాయి. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లవచ్చు. చాలా సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది. 


Also read: Astro Tips for Hair Cut: నూటికి 90 మంది చేసే పొరపాటు ఇదే, ఆదివారం హెయిర్ కట్ మంచిదా కాదా, ఏమౌతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook