Shani Asta Effects on Zodiac Signs: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శని గ్రహ ప్రభావం 2023 సంవత్సరం నుంచి ప్రరంభమైంది. అయితే ఇదే నెలలో జనవరి 17న కుంభరాశిలోకి శని గ్రహం సంచారం చేసింది. అయితే ఈ సంచారం 30 సంవత్సరాల తర్వాత జరగడం కారణంగా చాలా రాశులవారిపై మంచి ప్రభావం పడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇదే రాశిలోకి చాలా గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా చాలా రకాల ప్రయోజనాలతో పాటు మరికొన్ని రాశువారికి నష్టాలు జరిగే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా 15 రోజుల్లోనే శని గమనం మారితే మొత్తం 12 రాశుల వారిపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఈ కింది రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాశిచక్రాలపై శని అస్తవ్యస్త ప్రభావం:
మేషరాశి:

మేషరాశి వారికి కుంభ రాశిలోకి శని గ్రహ సంచారం వల్ల చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వృత్తి పరంగా ఈ రాశివారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. ముఖ్యంగా ఈ క్రమంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభపడతారు. పోటి పరీక్షలకు సిద్దమయ్యేవారు ఈ క్రమంలో మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సంచారం వల్ల కొత్త ఇల్లు లేదా వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు.


వృషభం:
ఈ సంచారం వల్ల వృషభ రాశివారు కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ సంచారం కారణంగా శని గ్రహంలో చాలా రకాల మార్పులు సంభవిస్తాయి. దీంతో ఈ రాశువారికి ఆదాయం పెరగడమేకాకుండా ఖర్చులు కూడా తగ్గే ఛాన్స్‌ ఉంది. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా సమాజంలో గౌరవం పెరుగుతుంది.


కన్యారాశి:
కన్యారాశి వారికి శని గ్రహ సంచారం పెద్ద మొత్తంలో ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు దూరం కావడమేకాకుండా కుటుంబంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి ధైర్యం, శక్తి కూడా పెరుగుతుంది. ఉద్యోగ-వ్యాపారాల చేసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.


మకరరాశి:
కుంభరాశిలోకి శని గ్రహం సంచారం చేయడం వల్ల మకర రాశి వారికి రెండు మార్పులు జరిగి శుభ్ర ప్రదంగా మారబోతోంది. అంతేకాకుండా ఆదాయం పెరిగి ఖర్చులు కూడా తగ్గుతాయి. అయితే వ్యాపారాలు చేసేవారు ఈ క్రమంలో పెద్ద మొత్తంలో లాభాలు పొందుతారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్  


Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి