Shani Dev Angry: కలియుగ న్యాయమూర్తి అయితే శనిదేవుడు యెుక్క వక్రదృష్టి పడిందంటే మీ జీవితం నాశమనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. అందుకే శనిదేవుడు సంతోషించే పనులను మాత్రమే చేయాలి. ప్రస్తుతం శనిదేవుడు త్రికోణ స్థితిలో కుంభరాశిలో సంచరించస్తున్నాడు. ఈనెల చివర్లో అంటే జనవరి 31న శనిదేవుడు అదే రాశిలో అస్తమించనున్నాడు. కాబట్టి ఇప్పటి నుండి శనిదేవుడు ఇష్టమైన పనులు మాత్రమే చేయండి, నచ్చనవి చేయకండి. అంతేకాకుండా శనిదేవుడికి నచ్చని కొన్ని అలవాట్లుకు దూరంగా ఉండండి. శనిదేవుడికి నచ్చని పనులు లేదా అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ అలవాట్లు శనిదేవుడిని బాధిస్తాయి
** వడ్డీకి డబ్బులు ఇచ్చేవారిని శని వదిలిపెట్టడు. శని ఈ వ్యక్తులపై కొన్నిసార్లు వక్ర కన్ను వేసి చాలా హాని కలిగిస్తుంది. 
** మీరు శుభ్రత పాటించకపోతే శని మీపై ఆగ్రహిస్తాడు. అలాంటి వారికి వారికి శని ఎప్పుడూ రోగాలు, ఇబ్బందులు, ఆర్థిక అవరోధాలు, అపజయాలను ఇస్తాడు. అలాంటి వారికి కష్టపడి పనిచేసినా ఫలితం ఉండదు. కాబట్టి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండండి.
** బాత్రూమ్‌ను మురికిగా ఉంచే వ్యక్తులు. రాత్రిపూట కిచెన్‌లో లేదా ఇంట్లో ఎక్కడైనా సామానులు శుభ్రం చేయకుండా వదిలిపెట్టే వారు శనిదేవుడు కోపానికే కాకుండా రాహువు యొక్క ఆగ్రహానికి గురవుతారు. అలాంటి వ్యక్తులు తమ పనిలో అపజయాన్ని పొందుతారు. మీరు కష్టపడినా పూర్తి ఫలితం దక్కదు. 
** మీ పాదాలను లాగడం, కూర్చొన్నప్పుడు కాళ్లను కదపడం వంటి పనులు శనిదేవుడికి నచ్చవు. దీని వల్ల మీరు అశుభ ఫలితాలు పొందుతారు. మీ జీవితం గందరగోళంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు డబ్బు సమస్యలతోపాటు మానసిక సమస్యలను ఎదుర్కోంటారు. 


Also Read: Shukra Gochar 2023: ఫిబ్రవరి 25 వరకు శనిదేవుడి రాశిలోనే శుక్రుడు.. ఇక ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook