Shani Dev: ఈ శనివారం నాడు శని దేవుణ్ణి పూజిస్తే.. ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
Saturday of Sravana Masam: శ్రావణ మాసం మొదటి శనివారం జూలై 30వ తేదీ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారు శనివారం నాడు శని దేవుడిని పూజించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
Saturday of Sravana Masam: సాధారణంగా శనివారాన్ని శని దేవుడికి ఇష్టమైన రోజుగా చెబుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే శనివారానికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణమాసంలో శనివారం నాడు శని దేవుడికి పూజ చేస్తే ఆయన అనుగ్రహం మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అంతేగాక దీనివల్ల శని దోష ప్రభావాలు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి అని కూడా ప్రతీతి. ఇక శని దేవుడికి కొన్ని రాశుల వారంటే చాలా ఇష్టం. ఈ రాశుల వారిపై శని దేవుడి ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతుంటారు. ఈ సారి శ్రావణ మాసం మొదటి శనివారం జూలై 30వ తేదీ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారు శనివారం నాడు శని దేవుడిని పూజించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
మకర రాశి
మకర రాశికి శనిదేవుడిని అధిపతిగా పరిగణిస్తారు. ఈ రాశి చక్రంలో ఉన్న వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెబుతూ ఉంటారు ఎందుకంటే వీరిపై శని దేవుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందట. ఈ క్రమంలోనే మకర రాశి వారు ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారని, వైవాహిక జీవితం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉంటుందని నమ్మిక.
తులారాశి
ఇక తులారాశి విషయానికి వస్తే శని దేవుడికి తులారాశి వారి మీద చాలా ప్రేమ ఉంటుంది. శని దేవుడు దృష్టి తులా రాశి మీద ఉన్న వారి మీద చాలా తక్కువగా ఉంటుందని అంటుంటారు. ఈ క్రమంలో తులా రాశి వారి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. శని దేవుడి అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి జీవితంలో ఎప్పుడూ సుఖసంతోషాలే తప్ప ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వారి సుఖ సౌకర్యాలకు ఎలాంటి లోటు ఉండదు.
కుంభ రాశి
ఇక కుంభ రాశి వారి విషయానికొస్తే శని దేవుడి రెండవ రాశిగా కుంభ రాశిని చెబుతూ ఉంటారు. ఈ రాశిపై శని దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెబుతారు. కుంభరాశి వ్యక్తులు ఎప్పుడు ఆర్థిక సమస్యలు బారిన పడరు. ఈ రాశి వారికి డబ్బుకు లోటే ఉండదు, సమాజంలో గౌరవం ఇప్పుడు లభిస్తూ ఉంటుంది.
Also Read: Astrology Tips: మల్లెనూనెతో 41 రోజులు ఆ దేవుడిని పూజిస్తే ఇక అన్నింటా విజయం మీదే!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook