Oil Astro Remedies: ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య గురించి టెన్షన్ పడుతూనే ఉంటా. అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి అనేక మార్గాలు ఉన్నాయి అందులో దైవ మార్గం కూడా ఒకటి. ఎందుకంటే ఎవరూ పరిష్కారం చెప్పలేని సమస్యలకు కూడా దేవుడి దగ్గర పరిష్కారాలు ఉంటాయని చాలా మంది నమ్ముతారు. ఎవరి దగ్గరా చేతులు చాచని వ్యక్తి కూడా దేవుడు ముందు మోకరిల్లి తన సమస్యలు తీర్చమని ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఒక్కో సమస్య నుంచి బయటపడటానికి ఒక్కో రకమైన ప్రార్ధన అలాగే దైవ ఉపాసన ఉంటాయి. మీ మీ సమస్యల నుంచి బయట పడాలంటే జ్యోతిష శాస్త్రంలో కొన్ని ప్రత్యేక పరిహారాలు కూడా ఉంటాయి.. జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా చేయగలిగితే ఖచ్చితంగా ఆయా సమస్యల నుంచి బయటపడి ఇబ్బందులు లేకుండా సాఫీ జీవితాన్ని సాధించడం పెద్ద విషయం ఏమీ కాదు. అంతేకాక ఎలాంటి దురుద్దేశాలు లేకుండా కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నూనెలతో చేయగలిగిన కొన్ని పరిహారాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆవనూనె:
ఆవనూనెను సాధారణంగా ఇళ్లలో వంటకు ఉపయోగిస్తారు. అంతేకాక ఈ నూనెతో శని దేవుడిని ప్రార్థించే సంప్రదాయం కూడా చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. అయితే శని అనుగ్రహాన్ని పొందడానికి ఆవనూనె చాలా శ్రేయస్కరం అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే శని దేవుడిని ఉపాసన చేయాలంటే శనివారం సాయంత్రం ఒక గిన్నెలో ఆవనూనెను తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసుకున్నాక ఆ గిన్నె తీసుకువెళ్లి శని ఆలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాక రావి చెట్టు కింద 41 రోజుల పాటు నిరంతరం ఆవాల నూనె దీపాన్ని వెలిగించడం మంచిది. అలా చేస్తే మీ మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా అది నెరవేరుతుంది.
మల్లెపూల నూనె:
మీ కోరికలు నెరవేర్చుకోవాలంటే ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమంతునికి మల్లె నూనె సమర్పించాల్సి ఉంటుంది. అలాగే హనుమంతునికి పూలు సమర్పించి ధూప దీపాలు నైవేద్యంతో సహా సమర్పించి పూజిస్తే మేలు జరుగుతుంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మల్లె నూనెతో దీపం మాత్రం వెలిగించకూడదు. కేవలం హనుమంతునికి మల్లె నూనెని సమర్పించాల్సి ఉంటుంది.
నువ్వుల నూనె
నువ్వుల నూనె విషయానికి వస్తే నయం కాని రోగాలను సైతం దూరం చేయాలంటే ఈ నువ్వుల నూనెతో పరిహారం చేయాల్సి ఉంటుంది. 41 రోజులపాటు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే నయం కానీ రోగాలు సైతం మటుమాయం అవుతాయి. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అనేక రకాల ఉపయోగాలు కూడా ఉంటాయని చెబుతూ ఉంటారు.
డిస్క్లైమర్: ఇక్కడ ఇచ్చిన సమాచారం అంతా కూడా కేవలం పలువురి అభిప్రాయాలు మాత్రమే. జీ న్యూస్ దీనిని నిర్ధారించలేదు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్ దూకుడు.. రోజుల వ్యవధిలో మూడో యాడ్… క్రేజ్ వాడకం మామూలుగా లేదుగా!
Read Also: Samyuktha Hegde: వివాదాస్పద హీరోయిన్ కు తీవ్ర గాయాలు.. ఏమైందంటే?
క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.