Trigrahi Yog 2023 in Capricorn: ఆస్ట్రాలజీలో త్రిగ్రాహి యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మకరరాశిలో శని, బుధ, శుక్ర గ్రహాల కలయిక వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. డిసెంబర్ 28, 2022న బుధుడు ధనుస్సు రాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశించాడు. అదే సమయంలో డిసెంబర్ 29న శుక్రుడు కూడా మకరరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో శనిదేవుడు ఉన్నాడు. మకరరాశిలో ఈ మూడు గ్రహాలు కలయిక వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారికి అద్భుత ప్రయోజనాలు కలుగనున్నాయి.  ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్రిగ్రాహి యోగం ఈ రాశులకు శుభప్రదం
మేషరాశి (Aries): మేష రాశి వారు త్రిగ్రాహి యోగం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. కెరీర్‌లో గొప్ప విజయాలు సాధిస్తారు. బిజినెస్ ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా మీరు లాభం పొందుతారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆదాయం వనరుల పెరగడం వల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. 
మకరరాశి (Capricorn): త్రిగ్రాహి యోగం మకర రాశి వారికి మేలు చేస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. మీకు లక్ కలిసి వస్తుంది. ధన లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. 


మిధునరాశి (Gemini): త్రిగ్రాహి యోగం మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించడంతోపాటు కోరుకున్న చోటికి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. 
మీనరాశి (Pisces): శని రాశిలో చేసిన త్రిగ్రాహి యోగం మీన రాశి వారికి ఆకస్మిక ధనాన్ని ఇస్తుంది. కొత్త జాబ్ ఆఫర్ పొందవచ్చు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. రుణ విముక్తి లభిస్తుంది. జీవితంలో ఆనందం తాండవిస్తోంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. 


Also Read: Venus Transit 2023: శనిదేవుడి రాశిలో శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారు ధనవంతులవ్వడం పక్కా.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook