Shani Gochar 2023: 30 ఏళ్ల తర్వాత శని గమనంలో పెను మార్పు... ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే..
Shani Gochar 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాతగా భావిస్తారు. 2023లో శని సంచారం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Shani Gochar New year 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు తమ కదలికలను ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. ఈ గ్రహాల సంచారం మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశులనూ ప్రభావితం చేస్తుంది. పంచాగం ప్రకారం, 30 సంవత్సరాల తర్వాత శనిదేవుడు జనవరి 17న కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. కొత్త ఏడాదిలో శని సంచారం ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకురానున్నాయి. కుంభంలో శని సంచారం ఏ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
మిథునరాశి (Gemini)- శని మకరరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే మిథునరాశి వారికి అన్ని సమస్యలు తీరుతాయి. శని సంచారం వల్ల మీకు ఆర్ఖిక ప్రయోజనాలు కలుగుతాయి. విదేశాల నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది.
కర్కాటక రాశి (Cancer)- సూర్యుడు, గురుడు మరియు శుక్రుడు కలిసి లగ్నంలో ఉండటం వల్ల మీకు అదృష్ట తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది.. శనిదేవుడు కర్కాటక రాశిలో ఎనిమిదవ ఇంటికి అధిపతి. జనవరి 17న ఈ ఇంట్లో శనిదేవుడు సంచరిస్తాడు. శని అష్టమ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వ్యతిరేక రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
తుల (Libra)- శని మీ రాశిలో ఐదవ ఇంట్లో సంచరిస్తాడు. శనిమహాదశ మీపై ముగుస్తుంది. దీంతో మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. రెట్టింపు డబ్బు మీకు అందుతుంది. బిజినెస్ విస్తరిస్తుంది. కెరీర్ లో అపారమైన పురోగతి సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)- కుంభరాశిలో శని ప్రవేశించిన వెంటనే ధనుస్సు రాశి వారు సడేసతి నుండి బయటపడతారు. ధనుస్సు రాశి యొక్క మూడవ ఇంటికి శని అధిపతి. దీంతో మీకు ధైర్యం, శక్తి పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌తోపాటు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులు భారీ మెుత్తంలో లాభాలను ఆర్జిస్తారు.
Also Read: Shukra Gochar 2022: కొత్త ఏడాదిలో ఈ 5 రాశులవారు ధనవంతులు కానున్నారు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.