Shani Dev Gochar: శని దేవుడిని మంద గమనుడు అని పిలుస్తారు. ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు సంచరిస్తూ ఉంటాడు. శని దేవుడు ఒక రాశిలో ఎక్కువ  కాలం ఉండటం వలన కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. 2025లో శని దేవుడు దేవ గురు బృహస్పతికి సంబంధించిన మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఈ రాశి శుక్రుడికి ఉచ్చ స్థానం. మార్చి నెల ద్వితీయార్ధంలో శనీ దేవుడు మీన రాశిలో ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికీ గ్రహ పీడలు తొలిగిపోతాయి. ఇంకొన్ని రాశులు వారికీ లక్కు కలిసొచ్చే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహం రాశి..


శని దేవుడు మీన రాశిలోకి ప్రవేశించడం వలన సింహా రాశి వారికీ అనుకూలంగా ఉండబోతుంది. సింహ రాశి వారికీ మీన రాశిలో శనీ దేవుడు సంచారం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ కాలంలో కొన్ని శుభవార్తలను వింటారు. అంతేకాదు ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగార్ధులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార సంబంధమైన ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం.


కన్యారాశి..


శనీశ్వరుడు మీన రాశిలోకి ప్రవేశించడం వలన కన్యా  రాశి వారికీ అనుకోని లాభాలు కలగనున్నాయి. ఈ కాలంలో శని అనుగ్రహంతో ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. అనుకోని అవకాశాలు అందుకుంటారు. కొత్త వనరులతో అనుకోని ధనం సంప్రాప్తిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అందుకుంటారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.


వృశ్చిక రాశి..
శని కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశించడం వలన వృశ్చిక రాశికి ఎంతో శుభంగా ఉండనుంది. మీన రాశిలోకి శని సంచారం వలన మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ కాలంలో అనుకోని డబ్బు చేతికి అందుతుంది. మీ వ్యక్తిత్వానికి అందరు ఫిదా అవుతారు. వ్యాపారస్థులకు అనుకోని లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్థులు ప్రమోషన్ అందుకుంటారు.


గమనిక (Disclaimer): పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Media ధృవీకరించడం లేదు.


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి