Shani Nakshatra Gochar: శని గోచారంతో వచ్చే 7 నెలలపాటు ఈరాశులకు కష్టాలు.. ఇందులో మీరున్నారా?
Saturn Transit 2023: శనిదేవుడి రాశి మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. శనిదేవుడి శతభిష నక్షత్రం ప్రవేశం కొన్ని రాశులవారికి సమస్యలను తెస్తుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Transit 2023: శని గ్రహ గమనంలో చిన్న మార్పు కూడా మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. రీసెంట్ గా శనిదేవుడు రాహువు నక్షత్రమైన శతభిషలోకి ప్రవేశించాడు. శనిదేవుడు అక్టోబరు 17 వరకు అక్కడే ఉంటాడు. శని-రాహువు కలయిక కారణంగా వచ్చే ఏడు నెలలపాటు 5 రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని శతబిష నక్షత్ర ప్రవేశం ఏయే రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
శని సంచారం ఈ రాశులకు కష్టకాలం
మీనం (pisces)
శతభిషా నక్షత్రంలో శని సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మీన రాశి యెుక్క మొదటి దశలో శని సాడే సతి జరుగుతోంది. దీంతో మీరు అక్టోబరు వరకు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. మీరు ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. దాంపత్య జీవితం కొంత వరకు బాగుంటుంది.
కుంభం (Aquarius)
ఈ రాశిచక్రం యొక్క మొదటి దశలో శని సంచరిస్తుంది. మీకు అక్టోబర్ వరకు ఒడిదుడుకులు ఎదుర్కోవల్సి ఉంటుంది. కొన్నిసార్లు దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వ్యాధులు చుట్టుముడతాయి. వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురువుతాయి.
వృశ్చికం (Scorpio)
శని గోచారం కారణంగా వృశ్చిక రాశి వారు భూ వివాదాల్లో ఇరుక్కుంటారు. అనారోగ్యం బారిన పడతారు. తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించే వ్యక్తులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ గుట్టురట్టు అవ్వచ్చు. ఇతరులతో సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తవచ్చు.
కన్యా రాశి (Virgo)
శని సంచారం ఈ రాశివారి పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. వ్యాపారులు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
కర్కాటకం (Cancer)
శనిగ్రహం శతభిషా నక్షత్రంలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారు అనేక ఇబ్బందులకు గురవుతారు. వీరి ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. శని సంచారం మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపించవచ్చు. మీరు మానసిక ఒత్తడికి గురయ్యే అవకాశం ఉంది.
Also Read: Surya Gochar 2023: సూర్య గోచారంతో ఏప్రిల్ 14 వరకు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook