Surya Gochar 2023: సూర్య గోచారంతో ఏప్రిల్ 14 వరకు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరాశి ఉందా?

Surya Gochar 2023: బృహస్పతి రాశి అయిన మీనరాశిలో సూర్య సంచారం జరుగుతుంది. ఆదిత్యుడి రాశి మార్పు కొన్ని రాశులవారికి మేలు చేస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2023, 04:11 PM IST
Surya Gochar 2023: సూర్య గోచారంతో ఏప్రిల్ 14 వరకు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరాశి ఉందా?

Sun Transit 2023 in Telugu; విజయం, ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడిగా సూర్యభగవానుడిని భావిస్తారు. సూర్యుడు గ్రహాలకు రాజు. ఇతడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. వారం రోజుల కిందట ఆదిత్యుడు తన రాశిని మార్చి మీనరాశిలోకి ప్రవేశించాడు. ఏప్రిల్ 14 వరకు అతడు అక్కడే ఉంటాడు. సూర్యుడి రాశి మార్పు కారణంగా రాబోయే 23 రోజులపాటు కొన్ని రాశులవారికి లాభం కలుగనుంది. ఆ లక్కీ  రాశులేంటో తెలుసుకుందాం. 

సూర్య సంచారం ఈ రాశులకు వరం
వృషభం: ఈరాశి వారికి సూర్యుని సంచారం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. మీరు ఆర్థిక పురోగతి సాధిస్తారు. మీ సమస్యలన్నీ తొలగించబడతాయి. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. 
మిథునం: సూర్య సంచారం వల్ల మిథున రాశి వారికి గౌరవం పెరుగతుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగానే ఉంటుంది. మీరు శ్రమకు తగిన పూర్తి ఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి సూర్యుని సంచారం శుభప్రదం. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటికీ సమయం అనుకూలంగా ఉంటుంది.
తుల: సూర్యుని రాశి మార్పు తులారాశి వారికి పెద్ద విజయాన్ని చేకూరుస్తుంది. మీ శత్రువులు ఓడిపోతారు. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వీరికి ఏప్రిల్ 14 వరకు సమయం చాలా బాగుంది.
వృశ్చికం: సూర్యుని సంచారం వృశ్చికరాశి వారికి వ్యాపారంలో భారీ లాభాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. 
ధనుస్సు: ఏప్రిల్ 14 వరకు సూర్యుడు ధనస్సు రాశి వారి జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Budh Gochar 2023: నీచ రాజయోగాన్ని సృష్టించిన బుధుడు.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News