Shani Gochar: ప్రస్తుతం శని దేవుడు తన సొంత రాశి అయిన కుంభ రాశిలో తిరుగమనంలో సంచరిస్తున్నాడు. కుంభంలో శనీశ్వరుడు జూన్ 30 నుండి నవంబర్ 15 వరకు ఉండనున్నాడు. ఓ గ్రహం వక్ర గమనంలో తిరుగుతున్నపుడు సాధారణంగా అశుభ ఫలితాలను ఇస్తుంటాడు. అయితే.. ప్రస్తుతం శని దేవుడు వక్రగమనంలో కుంభ రాశిలో ఉండటం వలన ఈ నాలుగు రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వారి జీవితం సాగిపోనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి..
శని దేవుడు వక్రీగమనం వల్ల ఈ రాశి వారికి ఆర్ధికంగా మీ పరిస్థితి బాగుంటుంది. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్ధిక సమస్యల వలయం నుంచి బయట పడతారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అంతేకాదు ఎదుటి వారితో వాదనలకు దూరంగా ఉండండి..


ధనుస్సు..
శనీశ్వరుడి తిరోగమనంల వల్ల ధనుస్సు రాశి వారికి అనుకోని లాభాలు కలగనున్నాయి. అంతేకాదు మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపించనుంది. అంతేకాదు తోటి ఉద్యోగుల నుంచి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాదు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. అంతేకాదు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.


మకర రాశి..
మకరరాశి వారికి శనిదేవుడి అనుగ్రహం కారణంగా జీవితంలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా సాగుతుంది. త్వరలో ఈ రాశి వారికి ఏల్నాటి శని పోతుంది. అంతేకాదు కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు పటాపంచలు అవుతాయి. గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు చేతికి అందుతుంది.
మీ జీవిత భాగస్వామి సహాయంతో ఎలాంటి సవాలునైనా అధిగమిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మీ జీవితంలో కొత్త వసంతం వస్తుంది.


కుంభ రాశి..
శని దేవుడు ప్రస్తుతం కుంభ రాశిలో వక్రగమనంలో సంచరిస్తున్నాడు. దీంతో ఈ రాశి వారికీ అనుకోని ప్రయోజనాలు కలుగనున్నాయి. అంతేకాదు ముఖ్యమైన పనుల్లో విజయాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు సులభంగా నెరవేరుతాయి. అంతేకాదు ఊహించని శుభవార్త అందుకుంటారు. కానీ ఏ పని తొందరపడి చేయకండి.


పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook