Shani Dev: శని మహాదశ శుభ స్థానంలో ఏ పనులు చేసిన లాభాలే లాభాలు, ధనవంతులవడం ఖాయం!
Shani Mahadasha: రాశి చక్రాల్లో శని మహాదశ శుభ స్థానంలో ఉంటే వ్యక్తి జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలో ఆర్థింగా బలపడడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా పొందుతారు.
Shani Mahadasha: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు సంబంధించిన మహాదశ, అంతర్దశ కాలానుగుణంగా ఉంటుంది. జాతకంగా గ్రహాలు మహాదశలో ఉంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే అన్ని గ్రహాల్లా శని గ్రహానికి కూడా మహాదశలు ఉంటాయి. ఈ శని మహాదశ 19 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ సమయంలో వ్యక్తుల జాతకంలో బలమైన స్థానంలో ఉంటే చాలా లాభాలు కలుగుతాయి. ఎలాంటి పనులు చేసిన వారు లాభాలు పొందుతారు. శని మహాదశ ప్రాముఖ్యత అంటే ఏమిటి? ఈ క్రమంలో శని చెడు ప్రభావం ఉంటే, ఎలాంటి నియమాలు పాటింలో ఇప్పుడు తెలుసుకుందాం..
శని మహాదశ:
అన్ని గ్రహాల్లా కాకుండా శని గ్రహం మనిషిపై మహాదశ ప్రభావం 19 సంవత్సరాలు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ మహాదశ అందరి జీవితంలో వస్తుంది. శని గ్రహం మహాదశ జాతకంలో శని శ్రేష్ఠమైన స్థానంలో ఉంటే అన్ని రకాలుగా జీవితంలో లాభాలు పొందుతారు. ఆర్థికంగా బలపడడమేకాకుండా వ్యాపారస్తులకు భారీ లాభాలు కాలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అశుభ స్థానంలో ఉంటే:
శని గ్రహం మహాదశ కాకుండా జాతకంలో చెడు స్థానంలో ఉంటే చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలు రావడమేకాకుండా భారీగా నష్టపోయే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్నవారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్రంగా నష్టపోతారు. అంతేకాకుండా ఒత్తడి కూడా గురవుతారు. ఇలా ఆశుభ స్థానంలో ఉంటే 19 ఏళ్లు పాటు తీవ్రంగా నష్టపోతారు.
ఈ నియమాలు తప్పనిసరి:
శని మహాదశ సమయంలో మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. నాన్ వెజ్ కూడా తినకుండా ఉండాలి. స్త్రీలను, వృద్ధులను, కూలీలను అవమానించడం చాలా హానికరమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఉసిరి చెట్టుకు పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఆ చెట్టు కింది ఆవాల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలి. నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నల్లని బూట్లు, నల్ల గొడుగు శనివారం దానం చేయాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook