Shani Dev Remedies:  జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని దేవుడు కర్మల ప్రకారం ఫలాలను ఇస్తాడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అంటారు. శనిదేవుడి (Shani Dev) అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అదే శనిదేవుడి ఆగ్రహానికి గురి అయితే ధనవంతుడు కూడా దరిద్రుడిగా మారిపోతాడు. శనిదేవుడి కోపం నుంచి తప్పించుకోవడానికి ఆస్ట్రాలజీలో అనేక చిట్కాలు చెప్పబడ్డాయి. సాధారణంగా శనివారం శనిదేవుడిని పూజిస్తారు. దీంతో శనిదేవుడు అనుగ్రహించి మీపై ధనవర్షం కురిపిస్తాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడు ఇలాంటి వారిపై కోపంగా ఉంటాడు..
మద్యం సేవించేవారు, జూదం ఆడే వారిపై శనిదేవుడు కోపంగా ఉంటాడు. మరోవైపు దొంగతనం, మోసం, తల్లిదండ్రులను గౌరవించకపోవడం, నిస్సహాయులకు సహకరించకపోవడం మొదలైన చెడు అలవాట్ల ఉన్నవారు శనిదేవుడు ఆగ్రహానికి గురికావాల్సిందే. 


ఈ పరిహారం చేయండి
>>శనిదేవుని కోపాన్ని తగ్గించడానికి శనివారం ఆవనూనె, నువ్వులు మరియు నల్లని వస్త్రాలు మొదలైనవి దానం చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీ రాశి కుంభం మరియు మకరం అయితే మీరు నీలమణి రత్నాన్ని ధరించడం లాభదాయకం. 


>>శనివారం ఉపవాసం ఉండి శని దేవుడిని పూజించండి. సాయంత్రం శని దేవాలయానికి వెళ్లి నల్ల నువ్వులు సమర్పించి ఆవాల నూనె దీపం వెలిగించి శని మంత్రాన్ని జపించండి. శనివారం నాడు హనుమంతుడిని ఆరాధించడం కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.


Also Read: Neechbhang Rajyog: సూర్యుడి 'నీచభంగ రాజయోగం'.. ఈ 3 రాశులవారికి ఊహించనంత ధనం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U   


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook