Shani Dev Stone Ring: శని దేవుని ఇష్టమైన నీలమణి ధరిస్తే జీవితాంతం డబ్బే.. డబ్బు.. కానీ ఈ నియమాలు తప్పని సరి..
Shani Dev Stone Ring: శని దేవుని అతి ప్రీతికరమైన నీలమణి రత్నాన్ని ధరిస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Shani Dev Stone Ring: రత్నాల గురించి పుర్వీకులు ఓ రత్న శాస్త్రాన్ని కనుగొన్నారు. అంతేకాకుండా ఈ శాస్త్రానికి ఎంతో ప్రముఖ్యత ఉంది. కాబట్టి రత్నానికి అంత ప్రముఖ్యత ఉంది. అయితే శని చెడు ప్రభావం ఉన్నవారు ఓ రత్నాన్ని ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నీలమణి చాలా ఖరీదైన అంతేకాకుండా ఎంతో శక్తివంతమైనది. అయితే దీనిని ధరించడం వల్ల అదృష్టం వరిస్తుంది. అంతేకాకుండా దీనిని ధరించడం వల్ల జీవితాలను కష్టాలు కూడా తొలగిపోతాయి.
నీలమణి ప్రభావవం:
రత్న శాస్త్రంలో నీలమణి గురించి చాలా క్లుప్తంగా వివరించారు. అంతేకాకుండా ఇందులో నీలమణి, వజ్రం, పచ్చ, పుష్యరాగం మొదలైన వాటి గురించి కూడా వివరించారు. అంతేకాకుండా ఇది ఖరీదైనది కూడా చెప్పొచ్చు. ఈ రత్నాలను ధరించడం వల్ల గ్రహాల నుంచి శుభ ఫలితాలు లభించి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. లిలియా నీలమణి నీలి రంగులో ఉంటుంది కాబట్టి అందుకే నీలమణి అని అంటారు. నీలమణి కాకుండా శని లిలియా ధరించడం వల్ల కూడా జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రత్నాన్ని ధరించడం వల్ల ఏ పనుల్లోనైన విజయాలు సాధించే అవకాశాలున్నాయి.
లిలియా రత్నం ఈ రాశిచక్రలకు ప్రయోజనాలను కలిగిస్తుంది:
రత్న శాస్త్రం ప్రకారం.. లిలియా రత్నం వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభరాశి వారికి శుభప్రదమని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. లిలియా లేదా నీలం రత్నాన్ని ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ రత్నాన్ని నీలిరంగు గుడ్డలో చుట్టి దానిని ధరిస్తే జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఈ గుడ్డను పడుకునే ముందు దిండుకింద పెట్టుకుని పడుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి.
లిలియాను ఇలా ధరించండి:
శనివారం మధ్యాహ్నం లిలియా ధరించడం అత్యంత శుభప్రదని శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఉంగరం చర్మానికి తగిలేలా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీనిని ధరించడం వల్ల జీవితంలో శని దేవుని చేడు ప్రభావం సులభంగా తొలగిపోతుంది. అంతేకాకుండా ఈ రత్నాన్ని ధరించిన తర్వాత నాన్-వెజ్, ఆల్కహాల్ తీసుకోవడం మంచిదికాదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో..
Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook