Shani Margi 2022 Effect: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడిని న్యాయదేవుడిగా భావిస్తారు. ఎందుకంటే అతడు కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు కాబట్టి. అక్టోబరు 23, ఆదివారం తెల్లవారుజామున 4:19 గంటలకు శనిదేవుడు మకరరాశిలో (Shani Margi 2022) సంచరించాడు. అంటే అప్పటివరకు తిరోగమనంలో ఉన్న శనిదేవుడు నేరుగా నడవడం మెుదలుపెట్టాడు. శనిదేవుడు సంచారం మెుత్తం  అన్నిరాశులపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఇది కొన్ని రాశులకు శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. దీంతో ఆ రాశులవారు జీవితంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని ప్రత్యక్ష సంచారం ఈరాశులకు శుభప్రదం
వృషభం (Taurus): శని మార్గంలో ఉండటం వల్ల వృషభ రాశికి మేలు జరుగుతుంది. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. కొత్త ఉద్యోగావకాలు వస్తాయి. ధనలాభం వల్ల ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. 
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి శని మార్గంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. దీంతో వారి మనసుకు ఆనందం కలుగుతుంది. మీరు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు. ఈసమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఆఫీసులో మీ బాస్ సహకారం ఉంటుంది.
సింహం (Leo): ఈ రాశివారు సంతానాన్ని పొందుతారు. ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం అద్భుతంగా ఉండనుంది. 


తులారాశి (Libra): ఆఫీసులో అధికారుల సహకారం ఉంటుంది. వ్యాపారులకు మంచి సమయం. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల సపోర్టు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీకు పాత రుణాల నుండి విముక్తి లభిస్తుంది. 
మకరరాశి (Capricorn): ఉద్యోగులు ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం మధురంగా ​​ఉంటుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో సహచరుల సపోర్టు ఉంటుంది. మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు.
మీనరాశి (Pisces): కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. జీవిత భాగస్వామి యొక్క మద్దతు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. డబ్బు లాభిస్తుంది. మీరు ఎక్కిడైనా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారులు లాభపడతారు. 


Also Read: బుధ-శుక్రుల లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులవారి ఖజానా నిండటం ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook