Lakshmi Narayan Yog Effect on Zodiac Signs: జ్యోతిషశాస్త్రంలో రాశిచక్ర గుర్తులను మార్చడం, సంయోగం చేయడం మరియు గ్రహాల కదలికలను మార్చడం వంటి వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహాల ఈ స్థానాల ఆధారంగానే భవిష్యత్తు అంచనా వేయబడుతుందని నమ్ముతారు. నిన్న అంటే అక్టోబరు 26న బుధుడు తులరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో సూర్యుడు, శుక్రుడు, కేతువు ఉన్నారు. అయితే తులరాశిలో బుధుడు, శుక్రుడు కలిసి అరుదైన లక్ష్మీనారాయణ యోగాన్ని ఏర్పరిచాయి. ఈ యోగం మూడు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండనుంది. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ రాశులవారు అపారమైన డబ్బును పొందున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
లక్ష్మీ నారాయణ యోగం ఈ రాశులకు లాభం
కన్యారాశి (Virgo)- బుధ-శుక్రుల కలయికతో ఏర్పడిన లక్ష్మీనారాయణ యోగం కన్యా రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. వీరికి ధనలాభం ఉంటుంది. మీ అప్పులు తీరిపోతాయి. ఎక్కుడైనా చిక్కుకుపోయిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారులకు భారీ లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది. సంపాదనకు కొత్త మార్గాలు ఏర్పడతాయి.
ధనస్సు రాశి (Sagittarius)- ఈ లక్ష్మీ నారాయణ యోగం ధనుస్సు రాశి వారికి ఒక వరం అనే చెప్పాలి. బుధ-శుక్రుల కలయిక వల్ల ఉద్యోగంలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు.
మకరం (Capricorn)- లక్ష్మీ నారాయణ యోగం మకర రాశి వారికి చాలా మేలు చేస్తుంది.ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఊహించని ధనలాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిక్కుకుపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు మరియు సమాచారంపై అందించబడింది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: November Astrology: నవంబర్ నెలలో మారిపోనున్న ఆ రాశుల జాతకం, పట్టిందల్లా బంగారమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook