Shani Gochar Effect 2023: జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని న్యాయదేవుడిగా భావిస్తారు. మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శని. అందుకే ఇతడిని కర్మదాత అంటారు. శనిదేవుడు మకరరాశిని విడిచిపెట్టి జనవరి 17, 2023న కుంభరాశిలోకి ప్రవేశించనుంది. కుంభరాశిలో శనిదేవుడి సంచారం వల్ల విపరీత రాజయోగం (Vipreet Raj Yoga) ఏర్పడుతుంది. శని సంచారం వల్ల ఏ రాశుల వారు ఆర్థికంగా ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం (Cancer): కర్కాటక రాశిలో ఎనిమిదవ ఇంటికి శని అధిపతి. జనవరి 17న ఈ ఇంట్లో శనిదేవుడు సంచరించడం వల్ల విపరీత రాజయోగం ఏర్పడనుంది. దీంతో ఈరాశివారు సమాజంలో గౌరవం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారులు, ఉద్యోగులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.


కన్య రాశి (Virgo): కన్యారాశికి ఆరో ఇంటికి శని అధిపతి. ఈ దేవుడు ఆరో ఇంట్లో సంచరించడం వల్ల వ్యతిరేక రాజయోగం ఏర్పడనుంది. దీంతో మీరు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పోటీపరీక్షలకు సిద్దమవుతున్న వారు విజయం సాధిస్తారు. మీకు ఏదైనా జబ్బు ఉంటే దాని నుండి బయటపడతారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది.


ధనుస్సు రాశి (Sagittarius): శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే ధనుస్సు రాశి వారు శని సాడే సతి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రాశి యెుక్క మూడో ఇంట్లో శనిదేవుడు సంచరించనున్నాడు. దీని కారణంగా మీకు ధైర్యం పెరగనుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌తోపాటు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ టైం మీకు కలిసి వస్తుంది.


శని దేవుడిని ప్రసన్నం చేసుకునే మార్గాలు


>> శనివారం శనిదేవుడిని పూజిస్తారు. ఈరోజున దానం చేయడం శుభప్రదమైనదిగా భావిస్తారు. కాబట్టి శనివారం నాడు ఇనుము, నల్ల ఉరద్ పప్పు, నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాన్ని దానం చేయడం ద్వారా శనిదేవుడు సంతోషించి వరాలు కురిపిస్తాడు.


>> శనివారం నాజు రావి చెట్టు కింద దీపం వెలిగించి శని స్తోత్రాన్ని పఠించండి. దీంతో శనిదేవుడు అనుగ్రహిస్తాడు.


>> ఈరోజున హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని దేవుడి యెుక్క అశుభ ప్రభావాలు తగ్గుతాయి.


>> శనివారం రోజున చేపలు, పక్షులు మరియు జంతువులకు ఆహారం తినిపించడం ద్వారా శని యెుక్క వక్ర దృష్టి తొలగిపోతుంది.


 >> నిస్సహాయులకు మరియు బలహీనులకు మీ సామర్థ్యానికి అనుగుణంగా ప్రతిరోజూ దానం చేస్తే శని దేవుడు సంతోషిస్తాడు.


>> ప్రతి ఉదయం పక్షులకు ఆహారం మరియు నీరు ఇవ్వండి. చీమలకు పిండి మరియు పంచదార కూడా తినిపించవచ్చు. మాంసాహారం మరియు మద్యం సేవించడం మానుకోండి.


Also Read: Budhaditya Rajyog: ధనుస్సు రాశిలో బుధాదిత్య రాజయోగం.. కొత్త ఏడాదిలో మారనున్న ఈరాశుల ఫేట్.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook