Budhaditya Rajyog: ధనుస్సు రాశిలో బుధాదిత్య రాజయోగం.. కొత్త ఏడాదిలో మారనున్న ఈరాశుల ఫేట్..

Budhaditya Rajyog In Dhanu: ఆస్ట్రాలజీ ప్రకారం, బుధుడు మరియు సూర్యుని కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం 3 రాశుల వారికి వ్యాపార మరియు వృత్తి పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2022, 03:29 PM IST
  • ధనుస్సు రాశిలో బుధాదిత్య రాజయోగం
  • కొత్త సంవత్సరంలో వీరికి ఆకస్మిక ధనలాభం
  • ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి
Budhaditya Rajyog: ధనుస్సు రాశిలో బుధాదిత్య రాజయోగం.. కొత్త ఏడాదిలో మారనున్న ఈరాశుల ఫేట్..

Budhaditya Rajyog In Sagittarius: వేద జ్యోతిషశాస్త్రంలో బుధాదిత్య రాజయోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎవరి జాతకంలో ఈ యోగం ఏర్పడుతుందో వారు రాజకీయాల్లో విజయం సాధిస్తరు. అంతేకాకుండా వీరు సమాజంలో ప్రజాదరణ మరియు గౌరవం పొందుతారు. ధనుస్సు రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం (Budhaditya Rajyog) వల్ల మూడు రాశులవారు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

కుంభం(Aquarius): బుధాదిత్య రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. ఇది ఆదాయం మరియు లాభం యొక్క ప్రదేశంగా భావిస్తారు. దీంతో మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడతుుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

మిథునం (Gemini): బుధాదిత్య రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. భాగస్వామ్యంతో చేసే పనుల్లో మీరు విజయాలను సాధిస్తారు. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. ఈ యోగం వల్ల మీరు అనేక లాభాలను పొందుతారు.

వృషభం (Taurus): బుధాదిత్య రాజయోగం వల్ల ఈ రాశివారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే మీ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీరు వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇదే మంచి సమయం. సూర్య భగవానుడి ప్రభావం కారణంగా మీరు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. సహచరుల సపోర్టు లభిస్తుంది.

Also Read: Surya Transit 2023: కొత్త ఏడాదిలో మకరరాశిలోకి సూర్యుడు... ఈ 3 రాశులకు కెరీర్ లో పురోగతి, వ్యాపారంలో భారీగా లాభం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News