Vipreet Rajyog 2023: నూతన సంవత్సరంలో అరుదైన రాజయోగం.. ఈ 3 రాశులకు ఆకస్మిక ధనం..
Vipreet Rajyog 2023: కొత్త ఏడాదిలో శనిదేవుడు అరుదైన రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Vipreet Rajyog: 2023 ప్రారంభం కావడానికి ఆరు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా అదే ఏడాది ఎన్నో శుభ, అశుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. అదే విధంగా అరుదైన విపరీత రాజయోగం కూడా ఏర్పడబోతుంది. దీని ప్రభావం మానవ జీవితంపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ యోగం వల్ల ఏ రాశులవారు ప్రయోజనాలు పొందనున్నారో తెలుసుకుందాం.
కర్కాటక రాశిచక్రం (Cancer): శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ అరుదైన యోగం ఏర్పడుతుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో ఎనిమిదవ ఇంటికి శనిదేవుడు అధిపతి. ఈ విపరీత రాజయోగం మీకు అపారమైన సంపదను ఇస్తుంది. మీరు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. రాజకీయాల్లో ఉండే వారికి పదవి లభించే అవకాశం ఉంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
కన్య రాశిచక్రం (Virgo): వ్యతిరేక రాజయోగం ఏర్పడటంతో కన్యా రాశి వారికి మంచి రోజులు ప్రారంభం కాగలవు. ఆరో ఇంటికి శనిదేవుడు అధిపతి. ఈ యోగం వల్ల మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే మీరు దాని నుండి ఉపశమనం లభిస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius): విపరీత రాజయోగం ఏర్పడటం వల్ల మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే శనిదేవుడు మీ ఇంట్లోని మూడో ఇంట్లో సంచరించబోతున్నాడు. ఈ రాశివారు శని సడేసతి నుండి విముక్తి పొందుతారు. మీ వ్యాపారంలో విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
Also Read: Rahu Gochar 2023: కొత్త ఏడాదిలో రాహు గోచారం.. ఈరాశులవారు త్వరలో ధనవంతులు అవ్వడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook