Saturn enters Capricorn on 12 July 2022: శని గ్రహం మంగళవారం (జూలై 12) మకర రాశిలోకి ప్రవేశించింది. 29 ఏప్రిల్ 2022న మకర రాశిని వదిలి కుంభ రాశిలోకి ప్రవేశించిన శని.. ఇప్పుడు మరోసారి తన ప్రియమైన రాశికి చేరుకుంది. తిరోగమన శని సంచార ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. శని రాశి మారిన వెంటనే మళ్లీ మూడున్నర సతి, ధైయాలు మొదలయ్యాయి. ఏప్రిల్‌లో శని గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించిన వెంటనే కొందరికి సగానికి సగం సతి, ధైయ తొలగిపోయినా.. ఇప్పుడు మరోసారి శని గ్రహం పట్టుకుంది. 17 జనవరి 2023 వరకు వీరిపై శని మహాదశ ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం: 
ఈరోజు శని మకర రాశిలోకి ప్రవేశించడంతో మిథున రాశి వారిపై మళ్లీ శని గ్రహ ప్రభావం మొదలైంది. జనవరి 2023 వరకు శని గ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది. ఈ ఆరు నెలల పాటు వీరి అంతగా కలిసి రాదు. ఈ సమయంలో మిథున రాశికి ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే వాహనాల్లో వెళ్లేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 


తుల: 
తుల రాశి వారికి శని సంచారం కూడా ఏమాత్రం మంచిది కాదు. మకర రాశిలోకి శని ప్రవేశంతో తుల రాశి వారికి శని గ్రహం ధైయ మొదలైంది. తుల రాశి వారు ఈ ఆరు నెలల కాలం మానసిక ఒత్తిడికి గురవుతారు. అంతేకాకుండా శారీరక నొప్పిని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ఒత్తిడిని నివారించడానికి సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్ధిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


ధనుస్సు: 
శని రాశిలో మార్పు ధనుస్సు రాశి వారికి కూడా అనుకూలంగా లేదు. ఈ రాశి వారికి శని గ్రహం యొక్క అర్ధభాగం మళ్లీ ప్రారంభమైంది. అందుకే 6 నెలల పాటు వీరికి మళ్లీ శని గ్రహ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వచ్చే ఏడాది జనవరి వరకు ధనుస్సు రాశి వారు ధన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమాజంలో పేరు, ప్రతిష్టలు తగ్గుతాయి. అంతేకాదు వివాదాల్లో చిక్కుకోవచ్చు. అందుకే ఈ ఆరు మాసాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. 


Also Read: Sun Transit 2022: కర్కాటక రాశిలోకి సూర్యుడు.. నెల రోజుల పాటు ఈ రాశి వారిపై తీవ్ర ప్రభావం!   


Also Read: Sun Transit 2022: కర్కాటక రాశిలోకి సూర్యుడు.. ఈ నెల 16 తర్వాత కన్యా రాశి వారికి అదృష్ట కాలం..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook