Saturn Transit in Aquarius 2023 effect: న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు వచ్చే ఏడాది ప్రారంభంలో కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. జనవరి 17, 2023న శనిగ్రహం మకరరాశిని విడిచిపెట్టి కుంభరాశిలోకి వెళ్లనున్నాడు. కుంభరాశిలో శని సంచారం వల్ల కొన్ని రాశులవారిపై శని సాడేసతి మరియు ధైయా ప్రారంభమవ్వగా.. మరికొందరిపై ఇది తొలగిపోతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితంలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏయే రాశులపై శని సంచార ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునరాశి (Gemini): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 2023 జనవరి 17న శని కుంభరాశిలో సంచరించిన వెంటనే మిథున రాశి వారికి శని సాడేసతి నుండి విముక్తి పొందుతారు. దీని వల్ల వీరికి చెడు రోజులు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా బాధలు తొలగిపోతాయి. 
తుల (Libra): జనవరి 17, 2023న  తుల రాశి వారికి ధైయా నుండి విముక్తి లభిస్తుంది. వీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. మీరు పురోగతిని పొందుతారు, మీ ఆదాయం పెరుగుతుంది.
ధనుస్సు (Sagittarius): 2023 జనవరి 17న శనిగ్రహం కుంభరాశిలో ప్రవేశించిన వెంటనే ధనుస్సు రాశి వారికి సడే సతి నుంచి విముక్తి లభిస్తుంది. ధనుర్మాసంలో సడే సతి చివరి దశ జరుగుతోంది. 
కుంభం (Aquarius): శని 2023 సంవత్సరం ప్రారంభంలోనే కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీంతో ఈ రాశిపై శనిదేవుని సడే సతి రెండో దశ ప్రారంభం కానుంది. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. శారీరక మరియు మానసిక సమస్యలు ఉండవచ్చు. ధన నష్టం కలగవచ్చు.
మీనం (Pisces): మీనరాశిపై సాడే సతి ఉంటుంది. ఇది ఏప్రిల్ 17, 2030 వరకు అంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. అయితే వీరికి సాడేసతి మొదటి దశ వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.
మకరం (Capricorn): 2023 నుంచి మకరరాశిలో సడే సతి ఉంటుంది. ఈ రాశిపై మార్చి 29, 2025 వరకు సడే సతి కొనసాగుతుంది.


పరిహారాలు ఇవిగో..
సాడే సతి లేదా ధైయా యొక్క అననుకూల ప్రభావాలను నివారించడానికి, శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం నాడు కొన్ని చర్యలు తీసుకోవాలి. దానం చేయడం, శని చాలీసా పఠించడం, ఆవాల నూనె దీపం వెలిగించడం వంటి పనులు చేయండి. 


Also Read: Shukra Gochar 2022: డిసెంబరులో శుక్రుడి రాశి మార్పు... ఈ 4 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook