Shukra Gochar 2022: డిసెంబరులో శుక్రుడి రాశి మార్పు... ఈ 4 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా...

Shukra Gochar 2022: ఈరోజు నవంబర్ 11, 2022న శుక్రుడు వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు డిసెంబర్ నెలలో రెండుసార్లు సంచరించడం వల్ల నాలుగు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2022, 06:26 PM IST
Shukra Gochar 2022: డిసెంబరులో శుక్రుడి రాశి మార్పు... ఈ 4 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా...

Shukra Gochar 2022: లవ్, రొమాన్స్, సంపద మరియు లగ్జరీ లైఫ్ కు కారుకుడు శుక్రుడు. ఈరోజు వృశ్చికరాశిలో సంచరించిన శుక్రుడు వచ్చే నెలలో రెండు సార్లు తన స్థానాన్ని మార్చనున్నాడు. డిసెంబరులో రెండుసార్లు శుక్రుడు రాశి మారడం (Venus transit december 2022) వల్ల నాలుగు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. శుక్రుడు డిసెంబరు 3న ధనస్సు రాశిలో, డిసెంబరు 29న మకరరాశిలో సంచరించనున్నాడు. శుక్రుడి సంచారం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.  

శుక్రుని సంచారం ఈ రాశుల అదృష్టం
వృషభం (Taurus): వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుని సంచారం వల్ల ఈ రాశివారికి ధనలాభం ఉంటుంది.  ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తుల జీతం పెరగవచ్చు. పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. 
మిథునం (Gemini): శుక్రుని సంచారం మిథున రాశి వారికి మేలు చేస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి. ఖర్చులు పెరగడం వల్ల మీరు పొదుపు చేయలేరు. 

కర్కాటకం (Cancer): శుక్రుడు రాశిలో మార్పు కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది. కెరీర్‌లో ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తారు. ఈ సమయంలో అందరినీ గుడ్డిగా నమ్మడం మానుకోండి. జీవితంలో విలాస వస్తువులు పెరుగుతాయి. ప్రేమ, వైవాహిక జీవితం బాగుంటుంది.
కన్య (Virgo): కన్యా రాశి వారికి శుక్రుడి రాశి మార్పులు చాలా శుభప్రదంగా ఉంటాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఫ్యామిలీ సపోర్టుతో పెద్ద సమస్యను పరిష్కారిస్తారు.  ఆదాయం పెరుగుతుంది. మీరు ఊహించని ధనాన్ని పొందుతారు.

Also Read: Vivah Panchami 2022: వివాహ పంచమి ఎప్పుడు, శుభముహూర్తం, ప్రాముఖ్యత 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News