Shani Gochar 2023: జనవరి 17వ తేదీ రాత్రి 8.02 గంటలకు శనిదేవుడు మకరరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించింది. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించడంతో కొందరికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. సాధారణంగా శనిదేవుడి కటాక్షం ఉంటే చాలు వారికీ దేనికీ లోటు ఉండదు. కుంభంలో శని సంచారం వల్ల ఈ కింది రాశుల వారికి సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపార, వివాహ, ప్రేమ వ్యవహారాలలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని సంచారం ఈ రాశులకు శుభప్రదం
కన్య (virgo): శని గోచారం మీకు అద్భుతంగా ఉంటుంది. జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. సంతానం లేని దంపతులకు పిల్లలకు కలుగుతారు. ఈ సమయంలో తల్లిదండ్రులు శుభవార్తలు వింటారు. 


తుల (Libra): కుంభరాశిలో శని సంచారం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి. ప్రభుత్వ పనుల్లో వస్తున్న ఆటంకాలు తొలగిపోతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. జీవితం ఆనందంగా ఉంటుంది.


మిథునం (Gemini): మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. ఆధాత్మికత వైపు మీ దృష్టి మరలుతుంది. ఉద్యోగ, వివాహ విషయాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. 


మేషం (Aries) : ఈ సమయంలో మీ ఆదాయంలో ఊహించని పెరుగుదల ఉంటుంది. బిజినెస్ బాగుంటుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. 


వృషభం (Taurus): ఈ రాశి వారికి అనుకోకుండా ధనలాభం కలుగుతుంది. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభం పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలు రెండూ లాభసాటిగా ఉంటాయి. 


Also Read: Gupt Navratri 2023: దుర్గామాత ఈ రాశుల వారిపై నోట్ల వర్షం కురిపించనుంది.. ఇందులో మీరున్నారా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి