Gupt Navratri 2023: ఈ రోజే ప్రారంభం కానున్న గుప్త నవరాత్రులు.. ఈ రాశుల వారిపై నోట్ల వర్షం!

Gupt Navratri 2023: మరో రెండు రోజుల్లో మాఘ మాసం గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులు 5 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటాయి. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 12:50 PM IST
Gupt Navratri 2023: ఈ రోజే ప్రారంభం కానున్న గుప్త నవరాత్రులు.. ఈ రాశుల వారిపై నోట్ల వర్షం!

Gupt Navratri 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, గుప్త నవరాత్రులు మాఘ మాసం శుక్ల పక్షం ప్రతిపాద తేదీ నుండి ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం గుప్త నవరాత్రులు 22 జనవరి 2023, ఆదివారం నుండి ప్రారంభమవుతాయి. జ్యోతిష్యం దృష్ట్యా దుర్గామాత యొక్క 9 అవతారాల ప్రత్యేక పూజల సమయం చాలా ముఖ్యమైనది. తంత్ర సాధనకు గుప్త నవరాత్రులు (Gupt Navratri 2023) చాలా ముఖ్యమైనవి. జనవరి 22 నుండి జనవరి 30 వరకు జరిగే ఈ గుప్త నవరాత్రులు కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో ఏ రాశుల వారు విజయాన్ని, సంపదను పొందుతారో తెలుసుకుందాం. 

గుప్త నవరాత్రుల్లో ఈ రాశులకు లక్కే లక్కు...
మేషం (Aries): ఉపాధి కోసం ఎదురు చూస్తున్న మేష రాశి వారి నిరీక్షణకు తెరపడుతుంది. మీరు కెరీర్‌లో పురోగతిని సాధిస్తారు. కొత్త ఉద్యోగం సాధిస్తారు. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 

కన్య (Virgo): ఉద్యోగ-వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కొత్త బట్టలు, నగలు కొనుగోలు చేయవచ్చు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సరదాగా గడుపుతారు. మీరు బహుమతులు పొందవచ్చు. మీ కోరికలు నెరవేరుతాయి. 

వృశ్చికం (Scorpio): మీరు సంతోకరమైన వార్తను వింటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 

మకరం (Capricorn): న్యాయపరమైన సమస్య నుండి ఉపశమనం పొందుతారు. ఏదైనా మతపరమైన యాత్ర లేదా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో ఆనందం ఉంటుంది. 

మీనం (Pisces): మీ తెలివితేటలతో పెద్ద సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. మీకు భారీగా లాభాలు వస్తాయి. వ్యాపారంలో భారీగా పురోగతిని  సాధిస్తారు. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. 

Also Read: February Horoscope 2023: ఫిబ్రవరిలో ఈ రాశుల వారిపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News