Saturn Transit 2023: ఇనుప పాదాలపై శనిదేవుడు.. ఈరాశుల ఫ్యూచర్ ఛేంజ్ అవ్వడం ఖాయం..
Shani Dev: శనిదేవుడు కుంభరాశిలో ఇనుప పాదాలపై నడవడం ప్రారంభించాడు. దీంతో కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు.
Shani Dev Transit In Kumbh: గ్రహాల గమనంలో మార్పు మానవ జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం న్యాయప్రదాత అయిన శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు 0 నుంచి 30 డిగ్రీలకు శనిదేవుడు మారనున్నాడు. శని తన రాశి ప్రకారం పాదాలను ఛేంజ్ చేస్తాడు. ప్రస్తుతం అతడు ఇనుప పాదాలపై నడవడం ప్రారంభించాడు. దీంతో మూడు రాశులవారు కెరీర్ లో అపారమైన పురోగతిని సాధించనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
శనిదేవుడి సంచారం ఈ రాశులకు వరం
వృశ్చిక రాశిచక్రం
శనిదేవుడు ఇనుప పాదాలపై నడవడం వల్ల శష్ అనే రాజయోగాన్ని ఏర్పడుతుంది. దీంతో మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. శని కేతువు దృష్టిలో ఉన్నాడు. అందువల్ల, మీ తల్లి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కావున ఈ రాశివారు అక్టోబరు 30 వరకు జాగ్రత్తగా ఉండాలి. దీని నివారణ కోసం కేతువు యెుక్క బీజ మంత్రాన్ని పఠించండి. అవసరమైన వారికి దానం చేయండి.
కర్కాటక రాశిచక్రం
మీ కుటుంబంతో సంబంధాలు బలపడతాయి. మీరు పాతపెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లేదా పదోన్నతి లభించే అవకాశం ఉంది. జనవరి 17నుండి మీపై శనిదేవుడి ధైయా ప్రారంభమైంది. మీ జన్మ చార్ట్‌లో శని కేతువును చూస్తున్నాడు. దీంతో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఈ సమయంలో కేతువు యెుక్క బీజ మంత్రాన్ని జపించండి.
మీన రాశిచక్రం
శనిదేవుడి సంచారం వల్ల మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశం ఉంది. ఉద్యోగులు మీరు కోరుుకున్న చోటుకి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీకు త్వరలోనే గోల్డెన్ టైమ్ ప్రారంభమవుతుంది.
Also Read: Shani Dev: శనివారం నాడు ఈ 5 దృశ్యాలు కనిపిస్తే.. త్వరలో మీరు ధనవంతులవ్వడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook