Saturn Transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని న్యాయ దేవత. ఆయా రాశుల వారికి వారి కర్మానుసారం ఫలాలను అందజేస్తాడు. శని అశుభమనేది నిజమే కానీ.. శని అనుగ్రహం శుభ సంకేతం. శని అనుగ్రహం పొందితే కష్టనష్టాల బారినుంచి బయటపడటమే కాదు అదృష్టం కలిసొస్తుంది. ఈ నెల 12న శని కుంభరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. శని తిరోగమనంలో జరగనున్న ఈ రాశి మార్పు 3 రాశుల వారికి కలిసిరానుంది. ఆ 3 రాశుల వారికి శని అనుగ్రహంతో అదృష్టం కలిసొస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 3 రాశుల వారికి అదృష్టం


వృషభం (Taurus): వృషభ రాశి వారికి శని రాశి మార్పు అన్నివిధాలా కలిసొస్తుంది. చేపట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు.పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ధన లాభం పొందుతారు. కెరీర్‌లో పెద్ద మార్పు తథ్యం. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది.


సింహం (Leo) : సింహ రాశి వారికి ఇది అనుకూల సమయం. ఒకరకంగా పెద్ద వరమనే చెప్పాలి. ప్రతీ పనిలో విజయం చేకూరుతుంది. శత్రువులు మీ చేతిలో చిత్తవుతారు. పాత వివాదాలు పరిష్కారమవుతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. కెరీర్ ఆశాజనకంగా ఉంటుంది. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందుతారు. అనుకోని కారణాలతో వాయిదాపడిన పనులు పూర్తవుతాయి.


మకరం (Capricorn) : మకర రాశిలోకి శని ప్రవేశం.. ఆ రాశి వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి కలిసొస్తుంది. ఆర్థికంగా అంతా బాగుంటుంది. అనుకోని విధంగా ధన లాభం కలుగుతుంది. డబ్బు విషయంలో ఏ లోటు ఉండదు. కుటుంబ జీవితం, వృత్తిపరమైన జీవితం సాఫీగా సాగుతుంది.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Anchor Suma: సుమ బంగారుతల్లి.. ఎవరికీ తెలియని గొప్పవిషయం బయటపెట్టిన సీనియర్ నటి


Pawan Kalyan Temple Visit: నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కల్యాణ్... ఏకాదశి ప్రత్యేక పూజలు   


 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook