Saturn Transit 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ (జూలై 12) మకర రాశిలోకి శని ప్రవేశం జరగనుంది. తిరోగమనంలో భాగంగా శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. కుంభ రాశి నుంచి తిరోగమన స్థితిలో మకర రాశిలో సంచరించనున్నాడు. ఇది వృషభ,మీన, ధనుస్సు రాశుల వారికి కలిసిరానుంది. అదే సమయంలో కొన్ని రాశుల వారిపై చెడు ప్రభావం చూపనుంది. శని ప్రభావం పడటమంటే అన్ని విధాలుగా దివాళా తీయడమే. కాబట్టి శని పరిహారాల ద్వారా ఆ ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఆ పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని విముక్తికి చేయాల్సిన పరిహారాలు :


ప్రతీ శనివారం 'ఓం ప్రిం ప్రేమ్ ప్రాణం: శనిశ్చరాయ నమః' అనే శని మంత్రాన్ని రోజుకు 3 సార్లు జపించండి. నిత్యం ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శని దేవుడు సంతోషిస్తాడు. తద్వారా శని దోషం నుంచి విముక్తి కలుగుతుంది.


శని అమావాస్య రోజున ఉదయం పూట, సాయంత్రం పూట శని చాలీసా పఠించాలి.శని దేవుడి చిత్రపటాన్ని పూజిస్తూ మంత్రం జపించాలి. శని దేవుడి వరం హనుమంతుడికి ఉన్నందునా.. హనుమంతుడిని పూజించినా శని ప్రభావం పడకుండా ఉంటుంది.


శనివారం శ్రావణ నక్షత్రంలో జమ్మిచెట్టు మూలాన్ని నల్లదారంలో ధరిస్తే శని ప్రభావం నుంచి బయటపడుతారు. నల్ల నువ్వులు, నల్ల బూట్లు, నల్ల గొడుగు, నల్ల పప్పు మొదలైన వాటిని దానం చేసినా శని విముక్తి కలుగుతుంది.


శనివారం ఇనుప గిన్నెలో ఆవనూనె పోసి అందులో మీ ముఖాన్ని చూడండి. శని దేవాలయంలో ఏదైనా దానం ఇవ్వండి. పక్షులకు ధాన్యం పెట్టండి. ఇలా చేయడం వల్ల శని మీ పట్ల చల్లని చూపు కనబరుస్తాడు.


శివుడిని పూజించినా శని ప్రభావం వదులుతుంది. లేదా రావిచెట్టు వద్ద దీపం వెలిగించి శని మంత్రం పఠించండి. తద్వారా ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయి.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Srilanka Crisis: లంక విడిచి వెళ్లేందుకు రాజపక్సే యత్నం.. విమానాశ్రయంలో పట్టుకున్న ప్రజలు  


Also Read: Rain Alert: మరింత బలపడిన అల్పపీడనం..తెలుగు రాష్ట్రాల్లో ఇక వానలే వానలు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook