Shani Jayanti 2023: శని జయంతి నాడు 3 శుభ యోగాలు.. శనిదేవుడి అనుగ్రహం పొందడానికి ఇలా చేయండి..
Shani Jayanti 2023: మరో నాలుగు రోజుల్లో శని జయంతి రాబోతుంది. అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజున మూడు అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. శని జయంతి రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీరు శనిదేవుడు అనుగ్రహం పొందుతారు.
Shani Jayanti 2023 Shubh yog: ఆస్ట్రాలజీలో శని దేవుడిని కర్మ దాత అని పిలుస్తారు. ఎందుకంటే కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. మీ జాతకంలో శనిదేవుడు బలంగా ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. మీ కుండలిలో శని గ్రహం నీచ స్థానంలో ఉంటే ధనవంతుడు కూడా దరిద్రుడిగా మారతాడు. మే 19న శని జయంతిని జరుపుకోనున్నారు. ఈరోజునే శనిదేవుడు జన్మించాడు. ఇతడు సూర్యభగవానుడు మరియు ఛాయా యెుక్క కుమారుడు. శని జయంతి నాడు మూడు శుభరాజయోగాలు ఏర్పడనున్నాయి. ఆస్ట్రాలజీ ప్రకారం, శని జయంతి నాడు శోభన యోగం ఏర్పడుతోంది. అంతేకాకుండా కుంభరాశిలో శష్ యోగం, మేషరాశిలో గజకేసరి యోగం రూపొందుతున్నాయి. శని సడే సతి మరియు ధైయా ఎవరిపై ఉంటుందో వారు కొన్ని అననుకూల ప్రభావాలను ఎదుర్కోంటారు.
శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఇలా చేయండి..
1. శని జయంతి రోజున నల్లని బట్టలు ధరించి.. లక్క వస్తువులు, గొడుగుల దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది.
2. శని దేవుడికి ఉరద్ పప్పుతో చేసిన లడ్డూలను నైవేద్యంగా పెట్టడం వల్ల శనిదేవుడి సంతోషిస్తాడు.
3. ఈ రోజున నిస్సహాయులకు అన్నం పెడితే శని గ్రహదోషం నుండి బయటపడవచ్చు.
4. శని జయంతి రోజున ఇనుము కొనడం మానుకోండి.
5. శని జయంతి రోజున శ్మశాన వాటికలో కలప దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
6. ఈ రోజు పీపల్ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి.
7. శని జయంతి రోజున హనుమాన్ చాలీసా మరియు సుందరకాండ పఠించడం వల్ల శనిదేవుడి దుష్ప్రభావాల నుండి విముక్తి పొందుతారు.
Also Read: Saturn Mars Conjunction 2023: జూన్ 30 వరకు ఈ రాశుల జీవితం గందరగోళం.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook