Shani Kumbh Gochar 2023: గత మంగళవారం జనవరి 17 శని గ్రహం కుంభరాశిలోకి సంచారం చేసింది. ఈ సంచారం దాదాపు 30 సంవత్సరాల తర్వాత జరగడం వల్ల ఈ ప్రక్రియకు మహా రాశి పరివర్తన్ అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేరు పెట్టారు. ఈ ప్రభావం కారణంగా 12 రాశుల వారి జీవితాల్లో మార్పులు కనిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కొందరి జీవితాల్లో మంచి జరిగితే మరికొందరి జీవితాల్లో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శని కుంభరాశిలో దాదాపు నాలుగున్నర నెలల పాటు స్థిరంగా ఉండబోతున్నాడు. దీని కారణంగా ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1.మేషం:
రాహువు ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు. అయితే ఈ రాశి వారికి మానసికంగా పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇతర విషయాలకు వస్తే.. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలపరంగా పురోగతి సాధిస్తారు. అంతేకాకుండా ఖర్చులు తగ్గి.. ఆదాయం కూడా పెరుగుతుంది.



2 వృషభం:
వృషభ రాశి వారికి ఈ సంచార రోజులన్నీ అనుకూలంగా ఉంటాయి. కార్యాలయాల్లో మంచి పేరు సంపాదించుకొని పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కూడా లభిస్తుంది. వృషభ రాశి వారికి శని గ్రహం తొమ్మిదవ స్థానంలో ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో వీరి అదృష్టం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. 


3 కర్కాటకం:
కర్కాటక రాశి వారికి శని సంచారం వల్ల వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు మొదలవుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో నష్టాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా కార్యాలయంలో వ్యతిరేకంగా మీ పై కుట్రలు కూడా జరుగుతాయి. కాబట్టి ఈ క్రమంలో వివాదాలకు దూరంగా ఉంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


4. మిథునం:
ఈ రాశి వారికి శని గ్రహం తొమ్మిదో స్థానంలో ఉంటుంది. కాబట్టి వీరు ఈ క్రమంలో అదృష్టవంతులుగా మారతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో ఆకస్మిక లాభాలతో పాటు ఊహించని స్థాయిలో లాభాలు పొందుతారు. మిధున రాశి వారికి శని పీడ నుంచి విముక్తి లభిస్తుంది. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు


ఇది కూడా చదవండి : Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook