Shani Mahadasha: మీ జాతకంలో శని మహాదశ ఉంటే.. 19 ఏళ్లు పాటు తిరుగుండదు..
Shani dev: మనం చేసే మంచి, చెడు పనులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shani Mahadasha effect: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల మహాదశ మరియు అంతర్దశ కాలానుగుణంగా జరుగుతాయి. గ్రహాల మహాదశ మీ జాతకంలోని శుభ ప్రదేశంలో ఉంటే మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు. అదే అశుభ స్థానంలో ఉంటే మీరు చాలా నష్టపోతారు. జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడిని కలియుగ న్యాయమూర్తిగా భావిస్తారు. సాధారణంగా శనిదేవుడి యెుక్క మహాదశ 19 ఏళ్లు ఉంటుంది. మీ కుండలిలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు.
మంచి ప్రభావం
శని మహాదశ ప్రభావం ఏ వ్యక్తిపై 19 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మహాదశ ఒక్కసారైనా వస్తుంది. మీ జాతకంలో శనిదేవుడు శుభ స్థానంలో ఉంటే మీకు ప్రతి పనిలో విజయం లబిస్తుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీరు కింగ్ లా బతుకుతారు. మీ కటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
చెడు ప్రభావం
మీ జాతకంలో శనిదేవుడు నీచ స్థానంలో లేదా అశుభ స్థానంలో ఉంటే.. మీరు చాలా బాధలు పడాల్సి వస్తుంది. సమాజంలో మీ గౌరవం తగ్గుతుంది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతు్ంది. మీరు అనారోగ్యం బారిన పడతారు. మీ కెరీర్ లో అన్నీ అడ్డంకులే వస్తాయి. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
పరిహారం
శని మహాదశ సమయంలో మద్యం, నాన్ వెజ్ మరియు డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండండి. ఈ సమయంలో స్త్రీలను, వృద్ధులను, నిస్సహాయులను, కూలీలను అవమానించవద్దు. శనివారం సాయంత్రం పీపల్ చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించి మూడు సార్లు చెట్టు చుట్టు ప్రదక్షిణలు చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. మీరు శనిదేవుడి మంత్రాన్ని జపించడం వల్ల మీకు కలిసి వస్తుంది. ప్రతి శనివారం నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నల్లని బూట్లు దానం చేయడం మంచిది.
Also read: Guru Gochar 2023: మరో 24 గంటల్లో వీరి జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook