Shani Margi 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. మనం చేసే మంచి, చెడులను బట్టి శనిదేవుడు ఫలాలను ఇస్తాడు. ఇతడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. శని గ్రహాం యెుక్క రాశిలో మార్పు ప్రజల జీవితాలలో పెను మార్పులను తీసుకొస్తుంది. ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఈ నెల 23, ఉదయం 4:19 గంటలకు మకరరాశిలో సంచరించనున్నాడు.  జనవరి 2023 వరకు శనిదేవుడు మార్గంలో (Shani Margi 2022) ఉంటాడు. శని యెుక్క ఈ ప్రత్యక్ష  సంచారం నాలుగు రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్కీ రాశులివే..
మేషరాశి (Aries): శని దేవుడి మార్గం మేష రాశి వారి జీవితంపై మంచి ప్రభావం చూపుతుంది. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. అంతేకాకుండా బిజినెస్ విస్తరిస్తుంది. 
తులారాశి (Libra): తులారాశి వారికి ఈ రెండున్నరేళ్లు చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి. శని మార్గంలో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చాలా కాలంగా ఉన్న వివాదానికి పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి.
ధనుస్సు రాశి (Sagittairus): ధనుస్సు రాశి వారికి కూడా ఈ సమయం సంతోషకరమైనది. ఈ సమయంలో రుణ విముక్తి పొందుతారు. ప్రేమ వివాహాలలో విజయం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆఫీసులో మీ పని ప్రశంసించబడుతుంది.
మీనరాశి (Pisces): మీన రాశి వారికి కూడా శని మార్గం లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి శారీరక, మానసిక ఒత్తిడి దూరమవుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ ఇప్పుడు లభిస్తుంది. వ్యాపారంలో కూడా లాభం ఉంటుంది.


Also Read: Mercury transit 2022: తులరాశిలోకి బుధుడు... ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://bit.ly/3P3R74U  


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి