Mercury transit 2022: తులరాశిలోకి బుధుడు... ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..

Mercury transit 2022: గ్రహాల యువరాజు బుధుడు ఈ నెల 26న తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. మెర్కూరీ రాశి మార్పు వల్ల మూడు రాశులవారికి భారీ మెుత్తంలో డబ్బు లభించనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2022, 03:57 PM IST
Mercury transit 2022: తులరాశిలోకి బుధుడు... ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..

Budh Planet Transit In Tula 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం తన రాశిని నిర్ణీత సమయం తర్వాత మారుస్తుంది. ఈ గ్రహ సంచారాలు మొత్తం 12 రాశులపై విభిన్న ప్రభావాలను కలిగి ఉంటాయి. గ్రహాల రాకుమారుడైన బుధుడు అక్టోబర్ 26న తులరాశిలోకి (Mercury transit in libra 2022)ప్రవేశించబోతున్నాడు. బుధ సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగానూ, మరికొన్ని రాశులవారికి అశుభకరంగానూ ఉంటుంది. తులరాశిలో బుధుడి సంచారం వల్ల మూడు రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

బుధ సంచారం 3 రాశుల వారికి శుభప్రదం
కన్య (Virgo): బుధ గ్రహం యొక్క సంచారం కన్యా రాశికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. వీరికి అక్టోబరు 26 నుండి మంచి రోజులు మొదలవుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. మధురంగా ​​మాట్లాడటం వల్ల లాభాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. లాయర్లు, మార్కెటింగ్ వ్యక్తులు, ఉపాధ్యాయులు, రచయితలకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
ధనుస్సు (Sagittarius): బుధుడు రాశి మారడం వల్ల ధనుస్సు రాశి వారికి మేలు జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు జీతం పెరిగిందనే శుభవార్త వింటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. బిజినెస్ విస్తరిస్తుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. మీకు అదృష్టం తోడై ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.  
కుంభం (Aquarius): కుంభ రాశి వారికి బుధ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. కెరీర్‌లో భారీ లాభాలు ఉంటాయి. ఉద్యోగార్థులు మరియు వ్యాపారస్తులు ఇద్దరూ లాభపడతారు. కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. ఇంక్రిమెంట్లు ఉండవచ్చు. వ్యాపారం పెరుగుతుంది. షేర్ మార్కెట్, లాటరీలలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీరు ఇంటిని, కారును కొనుగోలు చేయవచ్చు. పూర్వీకుల వ్యాపారం లేదా ఆస్తి నుండి లాభం పొందుతారు.  

Also Read: Sun Transit 2022: సూర్యుడి సంచారం... దీపావళికి ముందు ఈ రాశులకు బ్యాడ్ టైమ్... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News