Shani Margi 2022: ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబరు 23న వస్తుంది. ఆరోజున శనిదేవుడు మకరరాశిలో తిరోగమనం నుంచి మార్గంలోకి రానున్నాడు. శనిదేవుడు (Shani Dev) ప్రత్యక్ష సంచారం వల్ల కొన్ని రాశులవారు శుభఫలితాలను పొందనున్నారు. ఎవరి జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనతి కాలంలోనే ధనవంతుడు అవుతాడు. ఏ వ్యక్తిపై శని వక్ర దృష్టి పడుతుందో ఆ వ్యక్తి జీవితం నాశమనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. శని మార్గంలో ఉండటం వల్ల ఏయే రాశులవారు అదృష్టం ప్రకాశించనుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries)- శని ప్రత్యక్ష సంచారం వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు. లాభం ఉంటుంది. ఆధ్యాత్మిక మరియు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు పనిలో విజయం సాధిస్తారు.
మిథునం (Gemini)- శని మార్గి వల్ల మీరు ఆర్థికంగా బలపడతారు. అదృష్టం కలిసి వస్తుంది. మిథున రాశి వారికి ఈ సమయం వరం లాంటిది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీరు చాలా గౌరవం పొందుతారు. 


కర్కాటకం(Cancer)- కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా ఫలవంతంగా ఉండబోతోంది. ఈ సమయం ఉద్యోగం మరియు వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. మీరు వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.  లాభం ఉంటుంది. ఆఫీసులో మీ పని ప్రశంసించబడుతుంది. మీరు కొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృశ్చిక రాశి (Scorpio)- ఈసమయంలో డబ్బు భారీగా రావడంతో మీరు ఆర్థికంగా మెరుగుపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో లాభసాటి అవకాశాలున్నాయి. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.  మీ పనిని అందరూ అభినందిస్తారు. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు.


Also read: Guru Margi November 2022: రాజయోగం ఏర్పరచనున్న మార్గి గురు.. ఈరాశులకు లక్కే లక్కు...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి