Shani Margi 2022 Effect: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడు నిన్నటి వరకు మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఇవాల్టి నుంచి అంటే అక్టోబరు నుండి ప్రత్యక్ష సంచారంలోకి (Shani Margi in Capricorn 2022) రానున్నాడు. జనవరి 17, 2023 వరకు అదే స్థితిలో ఉంటాడు. అయితే శని యెుక్క ఈ మార్గి 5 రాశులవారికి ప్రతికూలంగా ఉండనుంది. అయితే ఆ దురదృష్ట రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాకుండా శనిదేవుని ఆగ్రహానికి గురికాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులపై శనిచెడు ప్రభావం
వృషభం (Taurus): శని మార్గి వల్ల ఈ రాశివారి కష్టాలు పెరగనున్నాయి. పనిలో అడ్డంకులు ఎదురవుతాయి. ఖర్చులు విపరీతంగా పెరగనున్నాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అననుకూలంగా ఉంటుంది. 
కర్కాటకం (Cancer): శని ప్రత్యక్ష సంచారం కర్కాటక రాశి వారికి జీవితంలో అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలు ఉండవచ్చు. ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి. ఈసమయంలో మీ మాటలు అదుపులోకి ఉంచుకోండి. 
కన్య (Virgo): మార్గి శని కన్యారాశివారికి సమస్యలను సృష్టిస్తుంది. పని పూర్తి కాకపోవడంతో నిరాశకు గురవుతారు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇంట్లో వివాదాలు రావచ్చు.
మకరం (Capricorn): ఈరాశిలోనే శని ప్రత్యక్ష సంచారం జరుగునుంది. దీంతో ఈ రాశివారిపై శని సడేసతి కొనసాగుతోంది.ఈ వ్యక్తులు మానసిక మరియు శారీరక సమస్యలతో బాధపడవచ్చు. ఖర్చులు పెరుగుతాయి.
కుంభం (Aquarius): శని ప్రత్యక్ష సంచారం కుంభ రాశి వారికి ఇబ్బంది కలిగిస్తుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ కెరీర్‌లో అడ్డంకలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఇతరుల వ్యవహారాల్లో అస్సలు జోక్యం చేసుకోకండి, లేకుంటే నష్టం జరగవచ్చు.


శనిదేవుడి పరిహారాలు
>> శని ప్రత్యక్ష సంచారం వల్ల ఇబ్బంది పడేవారు, శనిమహాదశతో బాధపడేవారు శనివారంనాడు శని ఆలయంలో ఆవనూనె సమర్పించండి. 
>> శనివారం నాడు ఒక కంచు గిన్నెలో నూనె తీసుకుని..అందులో మీ ముఖాన్ని చూసుకుండి. అనంతరం ఆపై గిన్నెతో పాటు నూనెను దానం చేయండి. వీలుకాకపోతే దానిని శని ఆలయంలో ఉంచవచ్చు. 
>> ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
>> హనుమంతుని పూజించడం వల్ల కూడా శుభఫలితాలు కలుగుతాయి. 


Also Read: Surya Grahanam 2022: దీపావళి మరునాడే సూర్య గ్రహణం, ఆ నాలుగు రాశులకు అక్టోబర్ 25న ఏం జరగనుంది 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook