Dhanteras 2022: దంతేరస్ నాడు గిన్నెలు, పాత్రలు ఎందుకు కొంటారు

Dhanteras 2022: దేశవ్యాప్తంగా రేపు దంతేరస్ పండుగ జరుపుకోనున్నారు. దీపావళి వేడుక దంతేరస్‌తోనే ప్రారంభమౌతుంది. దంతేరస్ నాడు ఈ గిన్నెలు కొంటే..ఊహించని లాభాలు కలుగుతాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 22, 2022, 08:07 PM IST
Dhanteras 2022: దంతేరస్ నాడు గిన్నెలు, పాత్రలు ఎందుకు కొంటారు

హిందూమతం ప్రకారం దంతేరస్ పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. దంతేరస్ నాడు కొన్ని ప్రత్యేక వస్తువులు కొనుగోలు చేస్తే మంచిదని విశ్వసిస్తారు. ముఖ్యంగా స్టీల్, ఇత్తడి గిన్నెలు, బంగారం, సిల్వర్ ఆభరణాలపై ఆసక్తి చూపిస్తారు.

ఐదురోజుల దీపావళి పండుగ దంతేరస్‌తో ప్రారంభమౌతుంది. దీపావళికి రెండ్రోజుల ముందు దంతేరస్ వస్తుంది. అంటే అక్టోబర్ 23న రేపే దేశవ్యాప్తంగా దంతేరస్ జరుపుకుంటారు. దంతేరస్ నాడు లోహం కొనుగోలు శుభసూచకంగా భావిస్తారు. ఈ నమ్మకం చాలాకాలం నుంచి కొనసాగుతోంది. కొన్ని లోహాలు మీ ఆరోగ్యానికి కూడా లాభదాయకం. ఇత్తడి గిన్నెలో నీళ్లు తాగితే ఆరోగ్యపరంగా మంచి లాభాలున్నాయి.

వెండి లోహం ఖరీదు కావడంతో వెండి గిన్నెలు ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయలేరు. కానీ వెండి గిన్నెలో భోజనం చేస్తే చాలా లాభాలున్నాయని అంటారు. పాతకాలంలో రాజులు మహారాజులు అందుకే వెండి ప్లేటులో భోజనం చేసేవారు. దీనివల్ల చాలా రకాల అంటువ్యాధుల్నించి సంరక్షించుకోవచ్చు. వెండి లోహానికున్న ఓ ప్రత్యేక గుణం కారణంగా.కడుపు నొప్పి దూరమౌతుంది. దాహం తక్కువ వేస్తుంది. వెండితో బ్యాక్టీరియా సంక్రమించదు.

ఇత్తడి గిన్నెల వాడకం కూడా చాలాకాలంగా ఉన్నదే. ఆయుర్వేదంలో చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో అన్నం వండి తింటే..జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో కఫం సమస్య ఎక్కువగా ఉంటుంది. అదే రాగి లేదా ఇత్తడి గిన్నెలో నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే కఫం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

రాగిలో యాంటీ బ్యాక్టీరియా గుణాలు అధికం. ఫలితంగా కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులోని చెడు బ్యాక్టీరియాను అంతం చేసేందుకు దోహదం చేస్తుంది. క్రమబద్ధంగా రాగి గిన్నెలో వండుకుని తింటే అల్సర్, అజీర్ణం, అంటురోగాలు దూరమౌతాయి.

ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మట్టి పాత్రల్లోనే వండుకుని తింటుంటారు. దీనివల్ల సువాసన, రుచి పెరుగుతాయి. దాంతోపాటు పోషకాలు లభిస్తాయి. చాలా రోగోల్ని దూరం చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం మట్టిపాత్రలో వండుకుని తింటే శరీరానికి చాలా పోషక పదార్ధాలు లభిస్తాయి. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు దూరమౌతాయి. స్టీల్ గిన్నె వాడకం ఇటీవల సర్వ సాధారణంగా మారింది. ఎందుకంటే ఇందులో వండుకుని తినడం అత్యంత సులభం కూడా. 

ఇన్ని లాభాలున్నందునే దంతేరస్ నాడు తప్పకుండా వివిధ లోహాల గిన్నెలు, పాత్రలు లేదా బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు

Also read: Shani Gochar 2022: మకరరాశిలో శనిదేవుడు కదలిక.. 24 గంటల్లో ధనవంతులు అవ్వనున్న ఈ 4 రాశులవారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News