Shani Nakshatra Parivartan April 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని గ్రహానికి ఎంతో ప్రముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని అన్ని గ్రహాల కంటే శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. ఇది రాశి సంచారం చేయడం వల్ల వ్యక్తిగత జీవితాల్లో శుభ, అశుభ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో సంచార క్రమంలో ఉన్నాడు. ఇది 2025 సంవత్సరం వరకు అదే రాశిలో ఉంటుంది. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగన ఈ గ్రహం నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. ఈ శని గ్రహం 6 ఏప్రిల్ 2024 శనివారం పూర్వాభాద్రపద నక్షత్రంలోకి సంచారం చేస్తుంది. అయితే ఈ సంచారం 3:55 గంటల జరుగుతుంది. ఈ గ్రహం నక్షత్ర సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే శని గ్రహ నక్షత్ర సంచారం కారణంగా ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్వాభాద్రపద నక్షత్రం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పూర్వాభాద్రపద నక్షత్రానికి అధిపతిగా కుజుడు ఉంటాడు. మీ జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉంటే అదృష్టవంతులవుతారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఇది ఇలా ఉంటే ఈ గ్రహం ఎల్లప్పుడు కుంభం, మీన రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కుంభ రాశివారు చాలా అదృష్టాన్ని పొందుతారు. 


మేష రాశి:
శని నక్షత్ర సంచారం కారణంగా మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో భారీ లాభాలు కలగడమే కాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడ ఇంతక ముందు కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. దీంతో పాటు దాచుకున్న డబ్బు కూడా పెరుగుతుంది. ఆరోగ్య పరంగా చూస్తే, అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. 


కన్య రాశి:
శని గ్రహ ప్రభావం కారణంగా కన్య రాశివారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో పురోగతి కూడా లభిస్తుంది. దీంతో పాటు కుటుంబ జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్‌ లభించి రోమాంటిక్‌ లైఫ్ గడుపుతారు. దీంతో పాటు బంధుత్వం మధ్య ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. 


ధనుస్స రాశి:
ధనుస్సు రాశివారికి శని గ్రహం ప్రత్యేక సంచారం కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇంతక ముందు ఉన్న పనుల్లో ఉన్న ఆటంకాలు సుభంగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు ఆశించిన కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే వ్యాపారంల్లో పెట్టబడులు పెట్టేవారికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే పేమ సంబంధాల్లో మాధుర్యం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


మకర రాశి:
మకర రాశి వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు ఈ సమయంలో భూములతో పాటు ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారు కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి