Shani Nakshtra Transit 2024 Effect: మనం చేసే మంచి చెడులను బట్టి మన భవిష్యత్తును నిర్ణయించేవాడు శని దేవుడు. అందుకే ఇతడిని న్యాయదేవుడు లేదా కర్మదాత అని పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అదే శని ఆగ్రహానికి గురైతే ధనవంతుడు కూడాదరిద్రుడిగా మారుతాడు. నేడు(జనవరి 11)న శని గ్రహం శని గ్రహం శతభిషా నక్షత్రం యొక్క రెండవ దశలోకి ప్రవేశించనుంది. ఈ సమయంలో మూడు రాశులవారిపై శనిదేవుడు ప్రత్యేక అనుగ్రహం ఉండబోతుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకరరాశి
శని నక్షత్ర రాశి మార్పు మకరరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులు వెనువెంటనే పూర్తవుతాయి. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి.  మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. అప్పుల బాధ నుండి బయటపడతారు. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. 
తులారాశి
శనిగ్రహం శతభిష నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల తుల రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతోంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు. 
కుంభ రాశి
శనిదేవుడి ఆశీస్సులు కుంభరాశి వారిపై ఉంటాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. మీ పేదరికం పోతుంది. మీరు టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీ దారిద్ర్యం పోతుంది. మీరు అన్ని సమస్యలను అధిగమిస్తారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. అంతేకాకుండా మీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. 


Also Read: Saturn-Venus Transit: 500 సంవత్సరాల తర్వాత రెండు అద్భుతమైన రాజయోగాలు..ఈ రాశులవారికి పండగే..


Also Read: Devaguru Gochar 2024: మే 01 వరకు ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి