Shani Rahu Yuti 2023 effect: వయస్సు, దుఃఖం, వ్యాధి, సైన్స్, టెక్నాలజీ, ఐరన్ వంటి వాటికి కారకుడిగా శనిదేవుడిని భావిస్తారు. కుంభం మరియు మకర రాశికి అధిపతిగా శనిని అభివర్ణిస్తారు. పుష్య, అనూరాధ, ఉత్తర భాద్రపద నక్షత్రాలకు అధిపతిగా శనిదేవుడిని పేర్కొంటారు. శని  అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శనిదేవుడు కోపం ఉంటే ధనవంతుడు కూడా దరిద్రుడిగా మారతాడు. గత నెల 15న శని శతభిషా నక్షత్రం యొక్క మొదటి దశలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్రానికి అధిపతిగా రాహవును పరిగణిస్తారు. శని-రాహు ఈ కలయిక వల్ల అక్టోబరు 17 వరకు కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఈ సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 5 రాశులవారు జాగ్రత్త
కర్కాటకం
శనిగ్రహం శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం కర్కాటక రాశి వారికి అస్సలు కలిసిరాదు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీ ఆర్థికంగా క్షీణించే అవకాశం ఉంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఈ సమయంలో పెట్టుబడులకు దూరంగా ఉండండి. 
కన్య రాశి
శనిగ్రహం సంచారం కన్యారాశి వారికి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వైఫల్యం చెందవచ్చు. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. 
వృశ్చికరాశి
శని గోచారం వల్ల మీరు పూర్వీకుల ఆస్తిని పొందడంలో సమస్యలను ఎదుర్కోంటారు. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించే వారి రహస్యాలు బట్టబయలు అవుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. 


Also Read: Surya Grahan 2023: మరో నాలుగు రోజుల్లో ఈ రాశులకు మహార్ధశ.. ఇందులో మీరున్నారా?


కుంభ రాశి
ఈ రాశికి అధిపతి శని. దీని కారణంగా అక్టోబరు 17 వరకు కుంభరాశి వారు సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. మీ అహంకారమే మీకు ఇబ్బందిగా మారుతుంది. మీరు ఏదైనా పని చేయాలనుకుంటే దానికి కుటుంబ సభ్యుల మద్దతు లభించదు. 
మీనరాశి
శతభిషా నక్షత్రంలో శనిగ్రహ సంచారం మీనరాశి వారికి ప్రయోజకరంగా ఉండదు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. అక్టోబర్ 17 వరకు మీనరాశి వారు కాలం కలిసిరాదు. మీరు డబ్బు విషయంలో చాలా సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. 


Also Read: Guru Gochar 2023: మరి కొన్ని గంటల్లో ఈ 4 రాశుల జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook