Shani Transit 2023: సొంత రాశిలో శక్తివంతంగా మారిన శనిదేవుడు.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..

Shani Transit 2023: శనిదేవుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభంలో సంచరిస్తున్నాడు. గత నెల రోజులుగా కుంభంలో శని శక్తివంతంగా సంచరిస్తున్నాడు. ఇది 3 రాశుల వారికి కలిసి రానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2023, 04:19 PM IST
Shani Transit 2023: సొంత రాశిలో శక్తివంతంగా మారిన శనిదేవుడు.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..

Shani Gochar 2023 effect: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడు 30 ఏళ్ల తర్వాత తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మార్చి 13 నుండి శనిదేవుడు కుంభంలో శక్తివంతంగా మారాడు. అంతేకాకుండా శనిదేవుడు కుంభ రాశిలో బలమైన స్థానంలో ఉండనున్నాడు. దాని శుభప్రభావం మూడు రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలను అందించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

మిథునం: శనిగ్రహం యొక్క శక్తివంతమైన సంచారం మిథునరాశి వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. 
వృషభం: శని దేవుడు తన సొంత రాశిలో శక్తివంతంగా ప్రయాణించడం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. శని బలవంతుడు కావడం వల్ల వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు కెరీర్‌లో గొప్ప విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఉన్నతమైన స్థానం పొందుతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీరు ఏదైనా తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీరు విదేశాల నుంచి ప్రయోజనం పొందుతారు. 

Also Read: Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు పంచగ్రాహి యోగం.. ఈ 5 రాశుల వారికి బంపర్ ప్రయోజనం..

తుల రాశి: కుంభరాశిలో శనిదేవుడి సంచారం తులరాశి వారికి లాభిస్తుంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు కెరీర్ లో అపారమైన పురోగతి సాధిస్తారు. విద్యార్థులు ఏ పరీక్షలోనైనా విజయం సాధించగలరు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

Also Read: Surya Grahan 2023: మరో నాలుగు రోజుల్లో ఈ రాశులకు మహార్ధశ.. ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News