Remedies to Remove Sani Dosha:  రెండున్నరేళ్ల తర్వాత శనిగ్రహం తన రాశిని మార్చుకుని కుంభరాశిలోకి ప్రవేశించబోతోంది. దీని వల్ల కొందరికి శనిదోషం మొదలవుతుంది, కొందరికి దూరమవుతుంది. సడే సతిలో (Shani Sade Sati 2022) ఏడున్నర సంవత్సరాలు, ధైయాలో రెండున్నర సంవత్సరాలు శని ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. శని కర్మానుసారం ఫలితాలను ఇస్తాడు కాబట్టి శని యొక్క చెడు ప్రభావాలను నివారించడానికి, కొన్ని చర్యలు తీసుకోవాలి మరియు మంచి పనులు చేయాలి. శని దోష నివారణకు (Remedies to Remove Sani Dosha) మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా చేయండి..


** శని దోషాల నుండి బయటపడటానికి శనివారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించండి, తద్వారా గరిష్ట ఫలాలను పొందవచ్చు.


**  శని కోపం నుండి బయటపడటానికి ఒక మంచి మార్గం హనుమంతుని ఆశ్రయానికి వెళ్లడం. సంకత్మోచర హనుమంతుని (Lord Hanuman) అనుగ్రహం అన్ని కష్టాల నుండి కాపాడుతుంది. ఇందుకోసం ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవండి. ముఖ్యంగా మంగళ, శనివారాల్లో హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆయనకు ప్రసాదం సమర్పించండి. సుందరకాండను కూడా పఠించండి.


** శని ఆగ్రహాన్ని దూరం చేసుకోవడానికి శివుడిని ఆరాధించడం మంచి మార్గం. దీని కోసం, శివ సహస్రనామం లేదా శివుని పంచాక్షరీ మంత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఇది జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.


** శని కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు, కాబట్టి శని దేవుడికి ఇష్టమైన వాటిని చేయండి. మీ తల్లిదండ్రులను గౌరవించండి, వారికి సేవ చేయండి. స్త్రీలను గౌరవించండి. నిస్సహాయులకు మరియు పేదలకు సహాయం చేయండి.


** శని సంబంధమైన దానాలు చేయడమే కాకుండా ఇంట్లో శని మొక్కను పెడితే శనీశ్వరుని అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. మీరు శమీ మొక్కను నాటలేకపోతే, కనీసం 3 అంగుళాల పొడవు గల శమీ వృక్షాన్ని నల్లటి గుడ్డలో కట్టి మీ కుడి చేతికి ధరించండి. దీంతో శని శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు.


** బెల్లం లేదా పంచదార కలిపిన మంచినీళ్లను రావి చెట్టుకు సమర్పించండి. ఆ తర్వాత నూనె దీపం పెట్టాలి. ప్రతి శనివారం ఈ పని చేయండి, ఇది గొప్ప ప్రయోజనం.


Also Read: Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ నాడు ఈ దానం చేస్తే... అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్యం... 


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.) 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook