Benefits of Shash And Malavya Rajyog: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా శుభ, అశుభ యోగాన్ని సృష్టిస్తోంది. ఈ ఏడాది శుక్రుడు మరియు శని స్థానాల కారణంగా రెండు శుభకరమైన యోగాలు ఏర్పడుతున్నాయి. మార్చి నెలలో శుక్రుడు మాలవ్య రాజయోగం, శని శష్ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ రెండు రాజయోగాలు ఒకేసారి ఏర్పడటం దాదాపు 500 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ రాజయోగాల వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు గురించి తెలుుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభం: కుంభ రాశికి అధిపతి శని. పైగా శని గ్రహం 30 ఏళ్ల తర్వాత ఇదే రాశిలో సంచరిస్తోంది.  శుక్రుడు మరియు శని చేస్తున్న రాజయోగం కుంభరాశి వారు చాలా ప్రయోజనాలను పొందబోతున్నారు. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీరు రుణవిముక్తి నుండి బయటపడతారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 
మిథునం : మార్చి నెలలో ఏర్పడబోతున్న ఈ రాజయోగాలు మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. మీ కెరీర్ బాగుంటుంది. 


Also Read: Lohri 2024: లోహ్రి రోజు రెండు శుభయోగాలు.. జనవరి 14 నుంచి ఈ 5 రాశులకు మంచి రోజులు..


తుల: తులారాశికి అధిపతి శుక్రుడు. పైగా శుక్రుడు మరియు శని ద్వారా ఏర్పడే రాజయోగం తులరాశి వారికి చాలా లాభాలను ఇవ్వనుది. మీ ఆర్థిక పరిస్థితి  బలపడుతుంది. మీరు ఈ సమయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ వైవాహిక జీవితం  బాగుంటుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. 


Also Read: Mars Transit: కుజుడి సంచారంతో జనవరి 16 నుంచి ఈ రాశులవారికి లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter