Shani Shukra Make Shadashtak Yog: శనిగ్రహం ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. మరోవైపు శుక్రుడు కర్కాటకరాశిలో ఉన్నాడు. ఆగస్టు 21న శుక్రగ్రహం కర్కాటకరాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి ప్రవేశిస్తుంది. ఇలా చేయడం వల్ల శని, శుక్రుడు కలిసి షడష్టక యోగాన్ని (Shadashtak Yog) ఏర్పరుస్తాయి. ఈ ప్రభావం సెప్టెంబరు 1 నుండి సెప్టెంబరు 24 వరకు ఉంటుంది. షడష్టక యోగం అంటే శని నుండి శుక్రుడు అష్టకంగా ఉంటాడని మరియు శని నుండి శుక్రుడు 6 గృహాల దూరంలో ఉంటాడని అర్థం. సెప్టెంబర్ 24 వరకు శుక్రుడు అక్కడే ఉంటాడు. ఆస్ట్రాలజీ ప్రకారం, షడష్టక యోగం శుభప్రదం కాదు. ఈ సమయంలో ముఖ్యంగా 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులపై షడష్టక యోగ ప్రభావం
వృషభం (Taurus): షడష్టక యోగం వృషభ రాశి వారి అదృష్టాన్ని కూడా దురదృష్టంగా మార్చగలదు. ఈ సమయంలో వీరు తమ బద్ధకాన్ని వీడి కష్టపడి పనిచేయాలి. లేకుంటే కెరీర్ లో ఇబ్బందులు తప్పవు.  


మిథునరాశి (Gemini): షడష్టక యోగం కారణంగా మిథునరాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంతే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రోజూ వాకింగ్ చేయడం మంచిది. 


ధనుస్సు (Sagittarius): శని-శుక్రుల షడష్టక యోగం ధనుస్సు రాశి వారికి ప్రమోషన్‌ను ఆపగలదు. మీరు పని ప్రదేశంలో ఎంత మర్యాదగా ఉంటే అంత మంచిది. కుటుంబ ఆస్తుల విషయంలో తగాదాలు రావచ్చు. 


కుంభం (Auarius): షడష్టక యోగం కుంభరాశివారి వైవాహిక జీవితంలో ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ సమయం టూర్‌లో ఉండే వారు తమ జీవిత భాగస్వామికి సమయం ఇవ్వలేరు. దానికి  కారణంగా వారి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. లవర్ కు తగినంత సమయం ఇవ్వకపోతే లవ్ బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది.  


Mercury-Venus Conjunction 2022: మిథునరాశిలో మహారాజయోగం.. ఈ 3 రాశులవారి కెరీర్ అమోఘం! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook