Makar Sankranti 2023: మకరరాశిలో శత్రు గ్రహాల కలయిక.. ఈరాశుల జీవితం నాశనమే ఇక..
Shani Surya Shukra yuti 2023: జనవరి 14 సాయంత్రం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా అరుదైన యాదృచ్చికం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.
Makar Sankranti 2023: జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజు అంటారు. సూర్యుడు ప్రతి నెలా తన స్థానాన్ని మార్చుకుంటాడు. మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అందుకే దీనిని మకర సంక్రాంతి అని పిలుస్తారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే అప్పటికే అక్కడ ఉన్న శుక్రుడు మరియు శనితో సంయోగం జరుపుతాడు. శని మకరరాశిలో ఉండటం వల్ల ఈసారి సంక్రాంతి ప్రత్యేకంగా ఉండబోతుంది. ఒకే రాశిలో తండ్రీకొడుకుల కలయిక కొందరి జీవితాల్లో పెను తుపాన్ రేపనుంది. వీరిని కష్టాలు చుట్టముట్టనున్నాయి.
సూర్య సంక్రాంతి నాడు ఈ రాశులవారు జాగ్రత్త
సింహరాశి (Leo): సూర్యుడు మకరరాశిలో సంచరిస్తున్నందున సింహ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కలహాలు వస్తాయి. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీరు డబ్బు అప్పుగా ఇవ్వడం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది.
తులారాశి (Libra): ఈ రాశి వారు కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మీ కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. మీరు మానసికంగా ఇబ్బంది పడతారు. ఈ సమయంలో మీరు చెడు వార్తలను వినే అవకాశం ఉంది. మీరు విహారయాత్రకు వెళ్లాలనుకుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి.
ధనుస్సు రాశి (Sagittarius): ఇతరులతో మాట్లాడేటప్పుడు పరుష పదజాలం ఉపయోగించకండి. మీరు మానసిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఈ సమయంలో మీరు కంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.
కుంభ రాశి (Aquarius): సూర్యుని సంచారం కుంభ రాశి వారి జీవితాలలో ఒడిదుడుకులను సృష్టిస్తుంది. ఈ సమయంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీపై శత్రువులు విజయం సాధిస్తారు. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి, లేకుంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.
Also Read: Happy Pongal 2023: ఈ వ్యక్తుల అదృష్టం సంక్రాంతి నాడు సూర్యునిలా ప్రకాశిస్తుంది.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook