Shani Transit 2024 In Telugu: ఏప్రిల్‌ నెలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ నెలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శని గ్రహం నక్షత్ర సంచారం చేస్తుంది. కుజుడు అధిపతిగా వ్యవహరించే పూర్వాభాద్రపద నక్షత్రంలోకి శని గ్రహం సంచారం చేయబోతోంది. ఈ గ్రహం నక్షత్ర సంచారం చాలా అరుదుగా చేస్తుంది. అయితే శని గ్రహం పూర్వాభాద్రపద నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ఆ తర్వాత శని గ్రహం అక్టోబర్‌ 3 వరకు సంచార క్రమంలోనే ఉంటుంది. అయితే జాతకంలో శని గ్రహం శుభస్థానంలో ఉంటే ఆ రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ధనవంతులయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే జాతకంలో ప్రతికూల స్థానాల్లో ఈ గ్రహం ఉంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..శని నక్షత్ర సంచారం కారణంగా ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారికి శని ప్రత్యేకమైన అనుగ్రహం:
కన్యా రాశి:

కన్యా రాశి వారికి శని చేసే నక్షత్ర సంచారం కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. న్యాయపరమైన సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. అంతేకాఉండా వ్యాపారాలు చేస్తున్నవారు అనేక శుభవార్తలు వినే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు పాత ఆస్తులు కూడా కొనుగోలు చేయోచ్చు. అలాగే పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం చాలా బాగుటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో ప్రయాణాలు కూడా చేసే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 


వృశ్చిక రాశి:
శని నక్షత్ర సంచార ప్రభావం వృశ్చిక రాశి వారిపై కూడా పడుతుంది. దీని కారణంగా ఊహించని లాభాలు పొందడమే కాకుండా నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అలాగే సంపాదన కూడా పెరుగుతుంది. అంతేకాకుండా తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్నవారు విపరీమైన లాభాలు పొందే ఛాన్స్‌ కూడా ఉంది. 


కుంభ రాశి:
శని ప్రత్యేక సంచారం కారణంగా కుంభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులు లభించడమే కాకుండా శని దేవుడి అనుగ్రహం లభించి సమాజంలో మంచి పెరును పొందుతారు. అలాగే వ్యాపారాల్లో వస్తున్న సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా పొట్ట సంబంధిత సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..a


మీన రాశి:
నక్షత్ర సంచారం కారణంగా మీన రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించడమే కాకుండా జీవితంలో వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా జీవితంలో వస్తున్న సవాళ్లు కూడా తొలగిపోయే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి