Shani Transit into Aquarius: శని, సడే సతి, ధైయా ఈ పేర్లు వినగానే కలవరం పుడుతుంది. ఎందుకంటే ఇవి అశుభానికి సంకేతాలు. ప్రస్తుతం శని తన స్వంత రాశిచక్రం కుంభరాశిలోకి ప్రవేశించాడు. దీంతో మీన రాశిలో సడే సతి ప్రారంభమై ధనుస్సు రాశి వారికి సడే సతి నుంచి విముక్తి లభించింది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శని.. 2025 వరకు ఈ రాశిలోనే ఉండనున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏడున్నరేళ్లు వెంటాడుతుంది :


శని సడే సతి ఏడున్నరేళ్లు వెంటాడుతుంది. ఇది ఏకకాలంలో 3 రాశిచక్రాల్లో సంచరిస్తుంది. అంతేకాదు, 3 దశలను కలిగి ఉంటుంది. సడే సతి మొదటి దశలో శని ఆర్థిక సమస్యలు కలిగిస్తాడు. అంటే ధన నష్టం, ఆదాయంలో అడ్డంకులు, దుబారా ఖర్చు వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.


సాడే సతి యొక్క రెండవ దశలో వ్యక్తి జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది సడే సతికి సంబంధించి అత్యంత కష్టతరమైన దశగా పరిగణించబడుతుంది. ఇక చివరిదైన మూడో దశలో భౌతిక ఆనందాలు దూరమవుతాయి.


కుంభ రాశి వారికి జాగ్రత్త అవసరం :


ప్రస్తుతం కుంభ రాశి వారికి అత్యంత బాధాకరమైన శని సడే శతి రెండవ దశ కొనసాగుతోంది. శని కుంభరాశిలో ఉండి ఇబ్బందులు కలిగించనున్నాడు. ధనంతో పాటు గౌరవాన్ని కోల్పోవాల్సి రావొచ్చు.


ఆరోగ్య, వైవాహిక, కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. కుంభ రాశిపై ఈ దశ మార్చి 29, 2025 వరకు ఉంటుంది. అప్పటివరకూ ఈ వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. 


కుంభ రాశి వారు ఈ కాలంలో కొన్ని పనులకు దూరంగా ఉండాలి.


అనవసరంగా వాదించకండి. అనైతిక పనులు చేయవద్దు. ముఖ్యంగా న్యాయపరమైన వివాదాలకు దూరంగా ఉండండి.
ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మద్యం మత్తులో ప్రయాణాలు మంచిది కాదు.


సడే సతి నుండి ఉపశమనం పొందేందుకు నివారణలు


శనివారం నాడు శని దేవుడిని ఆరాధించండి. శని చాలీసా చదవండి. ఆవనూనె దీపం వెలిగించండి.
శనివారం లేదా వీలైతే, ప్రతిరోజూ రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం పెట్టండి.
జమ్మి చెట్టుకు నీళ్లు పోయండి 
నిస్సహాయ, పేద ప్రజలకు సహాయం చేయండి.
మంగళవారం నాడు హనుమంతుని పూజించండి.
కాకికి ధాన్యం గింజలు వేయండి.


(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read:Mens Health: పురుషుల్లో పెరుగుతున్న టెస్టోస్టెరాన్ సమస్యలు.. ఇలా సులభంగా విముక్తి  పొందండి..!



 


Also read:Chandra Babu on CM Jagan: టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్‌లు పిరికితనానికి నిదర్శనం..సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook