COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shani Vakri 2023: ఈ సంవత్సరం దీపావళి పండగ  నవంబర్ 12న జరగబోతోంది. అయితే ఈ దీపావళికి ముందు రోజే శని గ్రహం తిరోగమనం చేయబోతోంది. నవంబర్‌ 04వ తేదిన శని గ్రహం కుంభరాశిలోకి తిరోగమన దశలో కదలబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారి జాతకాల్లో శని గ్రహం శుభ స్థానాల్లోకి వెళ్తే మరికొన్ని రాశుల వారి జాతకాల్లో శని అశుభ స్థానాల్లో ఉండబోతున్నాడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ తిరోగమనం కారణంగా దీపావళికి ముందు శని గ్రహం ఏయే రాశులవారిపై చెడు, మంచి ప్రభావాలను చూపుతాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ రాశులవారిపై శని మంచి ప్రభావం:
మేషరాశి:

శని గ్రహ తిరోగమనం కారణంగా మేష రాశివారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరికి సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారాల పెట్టుబడులపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్‌లో ఊహించని లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో మీ పాత స్నేహితులను కలిసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగాలు చేసేవారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


వృషభ రాశి:
వృషభ రాశివారికి దీపావళి పండగ ముందు నుంచే మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. వ్యాపారాలు చేసే ఈ రాశివారికి పెద్ద పెద్ద ఆర్థిక సంక్షోభాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు, వృత్తి జీవితాన్ని గడుపుతున్నవారు తప్పకుండా  ఈ సమయంలో శుభ వార్తాలు వింటారు. వీరు ఈ సమయంలో కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సమాజంలో మంచి పేరు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. 


మిథున రాశి:
మిథున రాశి వారికి నవంబర్ నెల మొత్తం ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో పెండింగ్‌లో ఉన్న డబ్బులు కూడా తిరిగి వస్తాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఆఫీసుల్లో గౌరవం లభించి..ప్రమోషన్స్‌ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మీ పిల్లల నుంచి కూడా శుభ వార్తలు వినే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి