Shani Gochar 2023: శని తిరోగమనంతో ఈ 3 రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా... మీరున్నారా?
Shani vakri 2023: కలియుగ న్యాయమూర్తి శనిదేవుడు మరికొన్ని రోజుల్లో రివర్స్ లో కదలనున్నాడు. శని గ్రహం యెుక్క తిరోగమనం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023 in Telugu: నవగ్రహాల్లో శనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనీశ్వరుడు.అందుకే ఇతడిని న్యాయదేవుడు అని పిలుస్తారు. సాధారణంగా శనిదేవుడు రెండున్నరేళ్లకు ఒకసారి రాశిని మారుస్తాడు. ప్రస్తుతం శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తోంది. మరి కొన్ని రోజుల్లో అంటే జూన్ 17న శనిదేవుడు రివర్స్ లో కదలనున్నాడు. సాధారణంగా తిరోగమనం చెడు ఫలితాలను ఇస్తుంది, కానీ శని యెుక్క వక్రీ మూడు రాశులవారికి మంచి ప్రయోజనాలను ఇవ్వబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
సింహం- శని తిరోగమనం సింహ రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు మెుదలవుతాయి. పనిలో మంచి పురోగతి సాధిస్తారు. బిజినెస్ విస్తరిస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.
ధనుస్సు- శని యొక్క వక్రీ ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యాపారం విస్తరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
మకరం- తిరోగమన శని మకరరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు డబ్బును పొదుపు చేస్తారు. ఏదైనా ఆస్తి లేదా కారును కొనుగోలు చేయడానికి ఇదే అనుకూల సమయం. లవ్ సక్సెస్ అవుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
Also Read: Chandra Grahan Yoga: చంద్రగ్రహణ యోగం ప్రభావం.. ఈ రాశుల జీవితం అల్లకల్లోలం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook