Shani Vakri 2023: శని తిరోగమనం.. ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం, జూన్ 17 వరకు నష్టాలు తప్పవు!
Shani Vakri 2023: శని తిరోగమనం కారణంగా అన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పలు రాశులవారు అనారోగ్య సమస్యల బారిన కూడా పడతారు. ఈ రాశులవారు పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
Shani Vakri 2023: శని గ్రహం కుంభరాశిలో తిరోగమనం చేస్తుంది. దీని కారణంగా అన్ని రాశులవారి జీవితాల్లో చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో ఉన్నాడు. జూన్ 17 రాత్రి 10:48 గంటలకు తిరోగమన దశలో శని కదలబోతున్నాడు. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఏయే రాశులవారు ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు:
మేష రాశి:
మేష రాశి వారు తప్పకుండా ఈ క్రమంలో కష్టపడి పనులు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వివిధ రకాల పనుల కారణంగా ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి. ఒత్తిడి పెరగడం కారణంగా శారీరక, మానసిక సమస్యల వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశివారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి:
కుంభరాశిలో శని ఎనిమిదవ స్థానంలో తిరోగమనం చేయబోతున్నాడు. కాబట్టి ఈ రాశివారు కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ క్రమంలో కష్టపడి చేయడం వల్ల మాత్రమే ఆశించిన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
తుల రాశి:
కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల తులా రాశి వారి జీవితంపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు మారేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తల్లి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.
కుంభ రాశి:
శని గ్రహ ప్రభావం కుంభ రాశి వారిపై కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో కూడా ఒత్తిడి సమస్యలు కలుగుతాయి.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook