Shash Rajayogam 2023: జూన్ 17న శష్ రాజయోగం..ఈ 3 రాశులకు కలిసిరానున్న కాలం..
Shani Vakri 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శనిదేవుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. త్వరలో శనిదేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. ఇది మూడు రాశులవారికి కలిసి రానుంది.
Shash Rajayogam 2023 benefits : గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలేది శని. ఇతడు రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని ఛేంజ్ చేస్తాడు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మార్చి 2025 వరకు అతడు అదే రాశిలో సంచరిస్తాడు. ఈ నెల 17న, రాత్రి 10:48 గంటలకు శని తన సొంత రాశిలో తిరోగమనం చేయబోతుంది. ఇదే స్థితిలో నవంబరు 04 వరకు ఉంటాడు. శని యొక్క వ్యతిరేక కదలిక కారణంగా శష్ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
శనిదేవుడు చేసిన శష్ రాజయోగం వల్ల వృశ్చిక రాశి వారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీరు ఏదైనా విలువైన వస్తువు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
సింహరాశి
శని తిరోగమనం సింహ రాశి వారికి ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీ పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు పాత పెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందుతారు.
Also Read: Rahu Planet: రాహువు ఎప్పుడూ ఈ 2 రాశులవారిని ఇబ్బంది పెట్టడు.. ఇందులో మీరున్నారా?
కుంభ రాశి
కుంభ రాశి వారికి శని సంచారం చాలా మేలు చేస్తుంది. వ్యాపారస్తులు భారీగా లాభాలను గడిస్తారు. బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది. మీ ఆరోగ్యం మునుపటి కంటే బాగుంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook